Pakistan : హిందూ ఆలయంపై మిస్సైల్ అటాక్!
Pakistan : జమ్మూ ప్రాంతంలోని ప్రసిద్ధ ఆప్ శంభు దేవాలయంపై పాకిస్తాన్ మిస్సైల్ దాడి(Pakistan missile attack on temple)కి తెగబడ్డట్లు తెలుస్తోంది.
- By Sudheer Published Date - 11:07 AM, Sat - 10 May 25

పాకిస్తాన్ (Pakistan ) మరోసారి రెచ్చిపోయింది. భారత్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తత (Tensions at India’s borders)లను పెంచుతూనే, ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రదేశాలను టార్గెట్ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జమ్మూ ప్రాంతంలోని ప్రసిద్ధ ఆప్ శంభు దేవాలయంపై పాకిస్తాన్ మిస్సైల్ దాడి(Pakistan missile attack on temple)కి తెగబడ్డట్లు తెలుస్తోంది. ఈ దాడిలో దేవాలయానికి ఆనుకుని ఉన్న భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దృశ్యాలను చూపిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Red Alert : పంజాబ్‌పైకి భారీగా పాక్ డ్రోన్లు.. అమృత్‌సర్, భటిండాలలో రెడ్ అలర్ట్
పాకిస్తాన్ చర్యలపై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల విశ్వాసానికి కేంద్రబిందువైన ఆధ్యాత్మిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం పాక్ దురుద్దేశాన్ని వెల్లడిస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు సైనిక ప్రాంతాలపై దాడులు చేసేందుకు యత్నించిన పాక్, ఇప్పుడు ఆలయాలపై దాడులకు పాల్పడటం వారి బుద్ది ఎలాంటిదో మరోసారి చెప్పకనే చెపుతుంది. ఈ దాడిపై భారత ప్రభుత్వ స్పందన కోరుతున్నారు ప్రజలు.
దేవాలయం ధ్వంసానికి సంబంధించిన వివరాలను భారత సైన్యం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ అందిన సమాచారం ప్రకారం ఇది గణనీయమైన మిస్సైల్ దాడిగా భావిస్తున్నారు. పాక్ చర్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించే అవకాశముంది. భద్రతా వ్యవస్థను మరింతగా బలపరిచే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.