Meghalaya Honeymoon Case : భర్త హత్యకు ముందు మరో 2 ప్లాన్లు వేసిన ఖిలాడీ
Meghalaya Honeymoon Case : సోనమ్, కుష్వాహా కలిసి.. మరో మహిళను హత్య చెయ్యాలి అనుకున్నారు. ఒక మహిళను చంపేసి, తగలబెట్టేసి.. ఆ చనిపోయిన మహిళను సోనమ్‌గా ప్రచారం చెయ్యాలి అనుకున్నారు
- By Sudheer Published Date - 03:13 PM, Fri - 13 June 25

మేఘాలయలో జరిగిన హనీమూన్ (Meghalaya Honeymoon ) హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. భర్త రాజా రఘువంశీ(Raghuvamshi)ని, తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి సోనమ్ (Sonam ) దారుణంగా హత్య చేయించిన ఈ ఘటనపై తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలు సామాజిక భావోద్వేగాలను కలిచివేస్తున్నాయి. తల్లి తనకు ఇష్టం లేని వివాహం చేయడాన్ని తట్టుకోలేకపోయిన సోనమ్, తాను ఇంట్లోంచీ వెళ్లిపోవాలని అనుకుంది. అలా వెళ్లిపోయి.. ఓ నదిలో.. ఓ మహిళ కొట్టుకుపోతున్నట్లుగా సీన్ క్రియేట్ చెయ్యాలి అనుకుంది. తద్వారా సోనమ్ సూసైడ్ చేసుకుంది అని తల్లి నమ్మేలా చెయ్యాలి అని ఆమె ప్లాన్ వేసుకుంది. కానీ ఇది వర్కవుట్ అవుతుందో లేదో అనే డౌట్ వచ్చింది. దాంతో మరో ప్లాన్ వేసుకుంది.
Air India Plane Crash : ‘కుబేర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా
సోనమ్, కుష్వాహా కలిసి.. మరో మహిళను హత్య చెయ్యాలి అనుకున్నారు. ఒక మహిళను చంపేసి, తగలబెట్టేసి.. ఆ చనిపోయిన మహిళను సోనమ్‌గా ప్రచారం చెయ్యాలి అనుకున్నారు. ఇది కూడా వర్కవుట్ కాలేదు. ఎందుకంటే.. ఏ మహిళను చంపాలి అనేది వారిద్దరికీ వెంటనే ఐడియా రాలేదు. అలా ఎవర్నో చంపాలంటే చాలా కష్టం అనుకున్నారు. అది అనుకున్నట్లు జరగకపోతే.. మొత్తానికీ తేడా వస్తుందని భావిస్తుండగానే పెళ్లి జరిగిపోయింది. ఇలా రెండు ప్లాన్లు విఫలమైన తర్వాత, ఆమె భర్తను హనీమూన్ సందర్భంలోనే హత్య చేయాలని పక్కా స్కెచ్ వేసింది.
Viral : విమానం కాలిపోయిన..చెక్కు చెదరని భగవద్గీత!
వివాహం జరిగిన రెండు రోజులకే సోనమ్ తన భర్తతో కలిసి మేఘాలయ హనీమూన్‌కు వెళ్లింది. అక్కడ సుపారీ కిల్లర్లను ఏర్పాటు చేసి, రాజాను దారుణంగా హత్య చేయించింది. ఈ హత్యను పూర్తిగా పక్కాగా అమలు చేసినట్టు భావించిన ఆమె, తనపై ఎటువంటి అనుమానం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అయితే హోటల్‌లో తనిఖీ చేసిన పోలీసులు ఆమె వదిలిపెట్టిన మంగళసూత్రాన్ని సూట్‌కేసులో కనిపెట్టారు. కొత్తగా పెళ్లైన వధువు తాళిని తీసేసినందుపైనే మొదట పోలీసులు అనుమానం వచ్చింది. అదే ఆచూకీ విచారణను ఆమె వైపుగా మళ్లించింది.
ఈ కేసులో మరో కీలక అంశం సోనమ్ మాట్లాడిన అబద్ధాలు. ఆమె అత్తగారితో మాట్లాడుతూ ఉపవాస దీక్షలో ఉందని చెప్పగా, సీసీ కెమెరాల్లో రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. హత్య జరిగే సమయంలో భర్తతో కాస్త దూరంగా నడిచిన విధానం కూడా పోలీసులకు అనుమానాస్పదంగా అనిపించింది. దీనితో పాటు, హత్య జరగకపోతే భర్తను సెల్ఫీ తీసుకుంటున్నట్టు నటించి లోయలోకి నెట్టేయాలనే మూడవ ప్లాన్ కూడా వేసినట్లు తేలింది. ఇలా ప్రేమ పేరుతో అత్యంత హీనంగా ప్రవర్తించిన సోనమ్ చివరకు నేరం వెలుగులోకి వచ్చి జైలుపాలైంది.