HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Marry Now Pay Later Best Wedding Loans In 2024

Wedding Loans: పెళ్లి చేసుకునేవారికి గుడ్ న్యూస్.. గ్రాండ్ వెడ్డింగ్‌ కోసం లోన్ పొందండిలా..!

ఈ ఏడాదిలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. గ్రాండ్ వెడ్డింగ్‌ని నిర్వహించడానికి రుణం (Wedding Loans) తీసుకోవాలనుకునే వారు బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిల నుండి రుణం తీసుకోవచ్చు.

  • Author : Gopi Date : 10-01-2024 - 8:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Google Pay Loan
Digital Loans

Wedding Loans: ఈ ఏడాదిలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. గ్రాండ్ వెడ్డింగ్‌ని నిర్వహించడానికి రుణం (Wedding Loans) తీసుకోవాలనుకునే వారు బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిల నుండి రుణం తీసుకోవచ్చు. గత సంవత్సరం 2023 చివరిలో ఇండియా ల్యాండ్స్ వెడ్డింగ్ స్పెండ్స్ రిపోర్ట్ 2.0ని విడుదల చేసింది. నేటి యువతీ యువకులు తమ పెళ్లి ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడడం లేదని నివేదికలో పేర్కొన్నారు. ఈ సర్వేలో 42 శాతం మంది యువత తమ పెళ్లి ఖర్చులకు తామే ఆర్థికంగా లేదా రుణం తీసుకోవాలనుకుంటున్నారని ఇండియా ల్యాండ్స్ తెలిపింది. కాబట్టి దేశంలోని బ్యాంకులు, NBFCలు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నాయి. బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు ఇప్పుడు కోటి రూపాయల వరకు వివాహ రుణాలను అందిస్తున్నాయి.

వెడ్డింగ్ లోన్ సెక్యూర్డ్ లోన్ పర్సనల్ లోన్ కేటగిరీలో వస్తుంది. అయినప్పటికీ బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు, డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్‌లు రుణం తీసుకునే వ్యక్తి రిస్క్ ప్రొఫైల్‌ను అంచనా వేసిన తర్వాత కోటి రూపాయల వరకు వివాహ రుణాలను అందిస్తున్నాయి. వివాహ రుణాలు ఏటా 20 శాతం చొప్పున వృద్ధిని చూపుతున్నాయి. దేశంలో అన్‌సెక్యూర్డ్ పర్సనల్ లోన్ మార్కెట్ విలువ రూ.1.25 లక్షల కోట్లు కాగా, ఇందులో వివాహ రుణం వాటా రూ.20,000 కోట్లకు పెరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. బ్యాంక్ 12 నుండి 60 నెలల సౌకర్యవంతమైన కాలపరిమితితో రూ.50,000 నుండి రూ. 40 లక్షల వరకు వివాహ రుణాలను అందిస్తోంది. వివాహ రుణం తీసుకోవడానికి సెక్యూరిటీ లేదా హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మీరు పని చేస్తున్న సంస్థ నెలవారీ జీతం స్లిప్ ఆధారంగా ఈ రుణం ఇవ్వబడుతుంది. వెడ్డింగ్ లోన్ పొందడానికి HDFC బ్యాంక్ జీతం ఖాతాదారుడి కనీస వేతనం రూ. 25,000. నాన్-హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ జీతం ఖాతాదారుడి కనీస వేతనం రూ. 50,000 ఉండాలి. రుణం తీసుకోవడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి.

Also Read: France Prime Minister: ఫ్రాన్స్‌ ప్రధానిగా ‘‘గాబ్రియల్’’.. 34 ఏళ్లకే అత్యున్నత పదవి.. ఎవరీ గాబ్రియల్ అటల్..?

ఐసీఐసీఐ బ్యాంక్ కూడా రూ.50,000 నుంచి రూ.50 లక్షల వరకు వివాహ రుణాన్ని అందిస్తోంది. దీనికి వడ్డీ రేటు 10.65 శాతం నుండి ప్రారంభమవుతుంది. రుణ గ్రహీతలు ఎలాంటి హామీని ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్సిస్ బ్యాంక్ రూ.40 లక్షల వరకు వివాహ రుణాన్ని అందిస్తోంది. దీనికి వడ్డీ రేటు 10.49 శాతం నుండి 22 శాతం మధ్య ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ కూడా 60 నెలల పాటు వివాహ రుణాన్ని అందిస్తోంది. రుణం తీసుకోవడానికి ఎలాంటి పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. NBFC బజాజ్ ఫిన్‌సర్వ్ కూడా లెండింగ్ లోన్‌లను అందిస్తోంది. రుణం తీసుకునే వ్యక్తి వయస్సు 21 ఏళ్లు పైబడి ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ లేదా బహుళ-జాతీయ కంపెనీలో ఉద్యోగం చేసి ఉండాలి. అతని CIBIL స్కోర్ 685 కంటే ఎక్కువ ఉండాలి. నెలవారీ జీతం రూ. 25001 కంటే ఎక్కువ ఉండాలి.

ఇండియాల్యాండ్స్ నివేదిక ప్రకారం..పెళ్లి చేసుకోబోయే యువతీ యువకుల్లో 26.3 శాతం మంది వివాహానికి ఆర్థికసాయం కోసం రుణం తీసుకుంటారు. 35.3 శాతం మంది యువత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి గొప్ప ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. సహజంగానే రుణం తీసుకుని పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఎన్‌బీఎఫ్‌సీ వెడ్డింగ్ లోన్ ఇచ్చి ఆడంబరంగా పెళ్లి చేసుకోవడానికి బ్యాంకులు పెద్దపీట వేస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • IndiaLends
  • Marriage Loans
  • Wedding Loans
  • wedding-ceremony

Related News

Solar Capacity For AC

ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

ఎండల నుండి ఉపశమనం పొందడంతో పాటు మీ కరెంటు ఖర్చులను దాదాపుగా సున్నా చేసుకోవచ్చు. అలాగే సోలార్ ఎనర్జీ అనేది స్వచ్ఛమైన, సురక్షితమైన శక్తి కాబట్టి ఇది పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

    Latest News

    • ఎంత నీరు తాగినా ఇంకా దాహమేస్తోందా?

    • ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

    • చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ మాస్టర్ ప్లాన్!

    Trending News

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd