Meghalaya : సత్యపాల్ పై `బర్తరఫ్` డిమాండ్
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను వదిలించుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఎప్పటికప్పుడు బీజేపీని ఇరుకున పెట్టేలా ఆయన చేస్తోన్న వ్యాఖ్యలపై కొందరు బీజేపీ నేతలు ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
- Author : CS Rao
Date : 05-01-2022 - 3:18 IST
Published By : Hashtagu Telugu Desk
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను వదిలించుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఎప్పటికప్పుడు బీజేపీని ఇరుకున పెట్టేలా ఆయన చేస్తోన్న వ్యాఖ్యలపై కొందరు బీజేపీ నేతలు ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, యూపీ ఎన్నికలకు ముగిసే వరకు మేఘాలయ గవర్నర్ గా మాలిక్ ను కొనసాగించాలని అధిష్టానం భావిస్తుందట. ఇంకా తొమ్మిది నెలలు మాత్రమే గవర్నర్ గా ఆయన ఉంటారు. ఆలోపుగా ఆయన్ను బర్తరఫ్ చేస్తే..మోడీ,అమిత్ షాపై దూకుడుగా వ్యవహరిస్తాడని భావిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిరోజూ ఏదో ఒక ట్వీట్ చేస్తున్నాడు.మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తున్నాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని డామేజ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసినప్పుడు నరేంద్ర మోడీ మైండ్ దొబ్బందని అన్నాడని సంచలన వ్యాఖ్యలు తాజాగా చేశాడు. వ్యవసాయ బిల్లుల గురించి చర్చించడానికి మోడీని కలిసినప్పుడు రైతుల ఆత్యహత్యల గురించి ఆయనేమన్నాడో సత్యపాల్ బయటపెట్టాడు. తన కోసం రైతులు ఆత్మహత్య చేసుకోలేదని మోడీ అన్నాడని వివాదస్పద అంశాన్ని సత్యపాల్ అన్నాడు. దీంతో బీజేపీ రాజకీయంగా మరింత నష్టపోతోంది.
మాలిక్ సీనియర్ పొలిటిషియన్. లోక్ దళ్ నుండి కాంగ్రెస్, జనతాదళ్, సమాజ్ వాదీ పార్టీ, ఆపై, చివరకు, బిజెపిలో చేరాడు.లోక్‌సభ , రాజ్యసభ సభ్యుడిగా చేసిన అనుభవం ఉంది. గతంలో క్యాబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు.
జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క ‘ప్రత్యేక హోదాను రద్దు చేసిన సంఘటనల కాలంలో శ్రీనగర్ (ఆగస్టు 2018 నుండి అక్టోబర్ 2019 వరకు) నుంచి మేఘాలయకు గవర్నర్ గా వెళ్లాడు. తొలుత బీహార్ గవర్నర్ గా సెప్టెంబర్ 2017 నుంచి ఆగస్టు 2018 మధ్య ఉన్నాడు. గోవా గవర్నర్‌గా నవంబర్ 2019 నుంచి ఆగస్టు 2020 చేశాడు.జమ్మూ & కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో అంబానీ మరియు ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న వ్యక్తి ఒక ఫైల్ క్లియెరెన్స్ కోసం తనకు రూ.300 కోట్ల లంచం ఆఫర్ చేశారని సంచలన వ్యాఖ్యలను చేశాడు. మోడీ ప్రభుత్వం, గోవాలో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఇప్పటికే మూడు రాష్ట్రాలకు మారిన గవర్నర్ గా గుర్తింపు ఉంది. అయినప్పటికీ ఆయన మోడీ సర్కార్ పై ఆరోపణలను ఆపలేదు. యూపీ ఎన్నికల వరకు భరించాల్సిందే నంటూ బీజేపీ నిర్ణయించుకుందని తెలుస్తోంది.