BJP vs AAP : గుజరాత్ బీజేపీ కార్యకర్తలు మాకే మద్దతు – ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్
గుజరాత్‌లోని అధికార బీజేపీ కి చెందిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు తన ఆమ్ ఆద్మీ పార్టీకి...
- Author : Prasad
Date : 10-10-2022 - 8:36 IST
Published By : Hashtagu Telugu Desk
గుజరాత్‌లోని అధికార బీజేపీ కి చెందిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు తన ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) రహస్యంగా మద్దతు ఇస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓటమిని చూడాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం పేర్కొన్నారు. . గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేతల గైర్హాజరీని ప్రశ్నించిన ఆప్ జాతీయ కన్వీనర్, గ్రాండ్ ఓల్డ్ పార్టీ బిజెపితో కలిసి పనిచేస్తుందని ఆరోపించారు. గుజరాత్‌లోని పలు నగరాల్లో శనివారం వెలువడిన పోస్టర్‌లపై ఆయన బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. అందులో తనను “హిందూ వ్యతిరేకి అంటూ పోస్టర్లు వేశారని. దీనికి బాధ్యులు “రాక్షసులు, కన్స్ వారసులు” అని కేజ్రీవాల్ అన్నారు.బ చాలా మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు తనను కలుస్తున్నారని.. అధికార పార్టీని ఓడించడానికి ఏదైనా చేయమని రహస్యంగా తనని అడుగుతున్నారని కేజ్రీవాల్ తెలిపారు. బీజేపీని ఓడించాలనుకునే బీజేపీ కార్యకర్తలు, నాయకులందరికీ ఆప్ కోసం రహస్యంగా పని చేయాలని తాను చెప్పాలనుకుంటున్నానని తెలిపారు.