Delhi Next CM: కేజ్రీవాల్‌తో మనీష్ సిసోడియా భేటీ, తదుపరి సీఎంపై కీలక నిర్ణయం
Delhi Next CM: కేజ్రీవాల్ మరియు సిసోడియా ఈ రోజు సమావేశం కానున్నారు. రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించిన తర్వాత ఇరువురి భేటీ ఆసక్తికరంగా మారింది. సివిల్ లైన్స్ ఏరియాలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
- By Praveen Aluthuru Published Date - 11:13 AM, Mon - 16 September 24

Delhi Next CM: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా సోమవారం సిఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal)తో సమావేశమవుతారని, తదుపరి ముఖ్యమంత్రి గురించి చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్ తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రజలు తనకు నిజాయితీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చుంటానని ప్రకటించారు. దీంతో ఢిల్లీ తదుపరి సీఎంపై ఉత్కంఠ నెలకొంది.(Delhi Next CM)
కేజ్రీవాల్ మరియు సిసోడియా(Manish Sisodia) ఈ రోజు సమావేశం కానున్నారు. రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించిన తర్వాత ఇరువురి భేటీ ఆసక్తికరంగా మారింది. సివిల్ లైన్స్ ఏరియాలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తదుపరి ముఖ్యమంత్రిపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఎక్సైజ్ పాలసీ అవినీతి కేసులో శుక్రవారం తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్, రెండు రోజుల్లో ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తానని, తన పార్టీ సహచరుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని చెప్పారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతని భార్య సునీత కేజ్రీవాల్ లేదా ఆప్ మంత్రి అతిషి పేర్లు తెరపైకి వచ్చాయి. వీళ్ళిద్దరితో పాటుగా గోపాల్ రాయ్ కూడా సీఎం రేసులో ఉన్నారు. ఏదేమైనప్పటికీ మనీష్ సిసోడియాతో కేజ్రీవాల్ భేటీ తర్వాత మీడియా సమక్షంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిని ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.
Also Read: Saripodhaa Sanivaaram OTT : 10 రోజుల్లో ఓటిటి లో సందడి చేయబోతున్న ‘సరిపోదా శనివారం’