Mumbai : ముంబైలో కల్తీ పాలను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
ప్రముఖ పాల బ్రాండ్ గోకుల్ ప్యాకెట్లలో కల్తీ పాలు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ప్రభాదేవి
- By Prasad Published Date - 09:15 AM, Fri - 30 December 22

ప్రముఖ పాల బ్రాండ్ గోకుల్ ప్యాకెట్లలో కల్తీ పాలు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలోని నివాసం ఉంటున్న నర్సిమ్మ యమదల, అతని కుమారుడు సురేష్‌ని దాదర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నివాసం నుండి వివిధ రకాల ప్యాకేజింగ్ మెటీరియల్స్, గ్లాసులు, ప్లేట్లు, మగ్‌లు, ఖాళీ పాల సంచులు మరియు సీలింగ్ మెటీరియల్స్ కొవ్వొత్తులు, స్టవ్ పిన్నులు మరియు కత్తెరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గోకుల్ పాల ప్యాకెట్లలో కల్తీ పాలను పోసి బ్యాగులను మళ్లీ సీల్ చేసి పంపిణీకి సిద్ధం చేశారు.
ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో కలిసి వారి ఇంటిపై రైడ్ నిర్వహించినట్లు దాదర్ పోలీసులు తెలిపారు. వారు కల్తీ పాలను విక్రయించే రాకెట్ నడుపుతున్నట్లు కనుగొన్నామని.. ఖాళీ పాల సంచులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. హోటళ్లు, టీస్టాళ్లు, టీ అమ్మేవారికి పాలు మరియు ప్యాకెట్లను తిరిగి ఇవ్వమని చెప్పారని.. , వారు తరువాత వాటిని తిరిగి ప్యాకింగ్ చేసి కల్తీ పాలను విక్రయిస్తున్నట్లు విచారణ తేలింది. నిందితులను పోలీసు కస్టడీకి తరలించి, ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద మోసం చేసినందుకు కేసు నమోదు చేశారు.