Pune: రోడ్డు ప్రమాదంలో గర్బిణీ మృతి. భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య..!!
- By hashtagu Published Date - 11:00 AM, Fri - 18 November 22

పుణేలోని జున్నార్ లో విషాదం నెలకొంది. గర్భవతి అయిన భార్య రోడ్డు ప్రమాదంలో మరణించింది. భార్య మరణాన్ని తట్టుకోలేని భర్త విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…జున్నార్ లో నివసించే రమేశ్ ఆయన భార్య మూడు రోజుల క్రితం బైక్ పై వరుల్ వాడికి వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న చెరుకు ట్రాక్టర్ వీరి బైక్ ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రమేశ్ భార్య అక్కడిక్కడే మరణించింది. గాయాలతో రమేశ్ బయటపడ్డాడు. అయితే తన భార్య మరణంతో తీవ్రంగా క్రుంగిపోయిన రమేశ్…గురువారం విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు, కోడలు మరణించడంతో రమేశ్ తల్లిదండ్రులు తీవ్రంగా రోదించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.