WB CM Sacks Minister: పార్థఛటర్జీపై వేటు.. కేబినెట్ నుంచి తప్పించిన దీదీ
పశ్చిమ బెంగాల్‌లో SSC రిక్రూట్‌మెంట్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి.
- By Naresh Kumar Published Date - 09:05 PM, Thu - 28 July 22

పశ్చిమ బెంగాల్‌లో SSC రిక్రూట్‌మెంట్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈడీ అరెస్ట్ నేపథ్యంలో పార్థా ఛటర్జీపై వేటేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేబినెట్ నుంచి తప్పించారు. ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.
ప్రస్తుతం పార్థ నిర్వహిస్తున్న వాణిజ్య, ఐటీ శాఖల బాధ్యతలను తానే చూసుకుంటానని ప్రకటించారు దీదీ.
అవినీతి వ్యవహారాల్లో తృణమూల్ కాంగ్రెస్ చాలా కఠినంగా ఉంటుందని స్పష్టంచేశారు. టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో పార్థా ఛటర్జీతోపాటు ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అర్పిత ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో 50కోట్ల నగదు, 5కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరో ఫ్లాట్‌లో తనిఖీలు చేపడుతున్నారు. అయితే, తన ఇంట్లో దొరికిన డబ్బంతా పార్థా ఛటర్జీదేనని అర్పితా ముఖర్జీ ఒప్పుకొన్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. పార్థా ఛటర్జీకి.. సీఎం మమతా బెనర్జీతో సన్నిహిత సంబంధాలున్నాయి. అభిషేక్ బెనర్జీ ఉన్నప్పటికీ..
తృణమూల్‌లో ఆయనే నెంబర్ టూ అంటారు. ఈడీ అరెస్ట్ సమయంలోనూ పార్థ నాలుగుసార్లు దీదీకి ఫోన్ చేసినట్టు తెలిసింది. అందుకే పార్థ ఛటర్జీ విషయంలో మమతను టార్గెట్ బీజేపీ చేసింది . కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించింది.