Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళా కాదు మృత్యుకుంభమేళా – సీఎం మమతా బెనర్జీ
Maha Kumbh Mela 2025 : సమగ్ర ఏర్పాట్లు చేయడంలో యూపీ ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఈ విషాదం చోటుచేసుకుందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు
- By Sudheer Published Date - 05:56 PM, Tue - 18 February 25

ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) విశ్వవిఖ్యాతమైన ఆధ్యాత్మిక మహోత్సవం. మిలియన్లాది మంది భక్తులు గంగ, యమున, సరస్వతీ నదుల సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించేందుకు వచ్చి సంధిస్తారు. అయితే, 2025లో జరుగుతున్న మహా కుంభమేళా ఘోర విషాదాన్ని నమోదు చేసింది. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా భక్తుల తాకిడి అధికమవ్వడంతో తొక్కిసలాట సంభవించింది. ప్రభుత్వ విభాగాల విఫలత కారణంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారని, 60 మందికి పైగా గాయపడ్డారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ సంఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.
Bhatti Vikramarka: వైద్య, ఆరోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యత.. రాజీవ్ ఆరోగ్యశ్రీకి నిధులు
సమగ్ర ఏర్పాట్లు చేయడంలో యూపీ ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఈ విషాదం చోటుచేసుకుందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తనకు కుంభమేళాపై భక్తి ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ మహోత్సవం మృత్యుకుంభంగా (‘Maha Kumbh turning into Mrityu Kumbh’ ) మారిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే మహా కుంభమేళాలో భద్రతా చర్యలు పకడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. సాధారణ భక్తుల కోసం సరైన వసతులు కల్పించకపోగా, వీఐపీల కోసం ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేయడం, భారీ ధరలు వసూలు చేయడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో ప్రసంగించిన మమతా బెనర్జీ.. కుంభమేళా తొక్కిసలాటపై మాత్రమే కాకుండా ఇతర అంశాలపైనా యూపీ ప్రభుత్వం మరియు కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అక్రమ వలసదారుల సమస్య, బంగ్లాదేశ్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ, భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహా కుంభమేళా వంటి గొప్ప ఆధ్యాత్మిక వేడుకలో ఇటువంటి అశుభ సంఘటనలు పునరావృతం కాకుండా, భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.
Kolkata: On #MahaKumbh2025, West Bengal CM Mamata Banerjee says, “This is ‘Mrityu Kumbh’…I respect Maha Kumbh, I respect the holy Ganga Maa. But there is no planning…How many people have been recovered?…For the rich, the VIP, there are systems available to get camps (tents)… pic.twitter.com/6T0SyHAh0e
— ANI (@ANI) February 18, 2025