Jaya Prada – Surrender : జయప్రదకు షాక్.. 15 రోజుల్లో లొంగిపోవాలన్న హైకోర్టు
Jaya Prada - Surrender : తమ సినిమా థియేటర్‌లో పనిచేసిన కార్మికులకు 18 ఏళ్లుగా ఈఎస్ఐ చెల్లింపుల్లో జాప్యం చేసిన కేసు సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదను వెంటాడుతోంది.
- By Pasha Published Date - 11:29 AM, Sat - 21 October 23

Jaya Prada – Surrender : తమ సినిమా థియేటర్‌లో పనిచేసిన కార్మికులకు 18 ఏళ్లుగా ఈఎస్ఐ చెల్లింపుల్లో జాప్యం చేసిన కేసు సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదను వెంటాడుతోంది. ఆ కేసులో తనకు విధించిన 6 నెలల జైలు శిక్షను రద్దు చేయాలంటూ జయప్రద దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి తోసిపుచ్చారు. జైలు శిక్షను రద్దు చేయడం కుదరదని, బెయిల్ కావాలంటే 15 రోజుల్లోగా మెజిస్ట్రేట్ ఎదుట లొంగిపోవడంతో పాటు రూ.20 లక్షలను డిపాజిట్ చేయాలని ఆర్డర్ ఇచ్చారు. కార్మికులకు ఈఎస్ఐ బకాయిల చెల్లింపులో జాప్యం చేసిన వ్యవహారంలో జయప్రదతో పాటు రామ్ కుమార్, రాజ్ బాబులకు చెన్నైలోని ఎగ్మూర్ ట్రయల్ కోర్టు ఆగస్టులో 6 నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ ముందుగా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టుకు వెళ్లిన జయప్రద.. తాజాగా హైకోర్టుకు వెళ్లారు. రెండు చోట్లా ఆమెకు చుక్కెదురైంది.
We’re now on WhatsApp. Click to Join.
ఏమిటీ కేసు..?
కొంతకాలం క్రితం జయప్రద.. చెన్నైకు చెందిన రామ్ కుమార్, రాజ్ బాబు అనే వ్యక్తులతో కలిసి తమిళనాడులోని అన్నాసాలైలో ఓ థియేటర్ ను ఏర్పాటు చేసి నిర్వహించారు. ఆ థియేటర్ లో చాలా మంది ఉద్యోగులు పని చేసేవారు. వారందరికీ ఈఎస్‌ఐ లు చెల్లించడంలో జయప్రదతో పాటు, రామ్ కుమార్, రాజ్ బాబు ముగ్గురు కూడా అవకతవకలకు పాల్పడినట్లు కేసు నమోదైంది. దీని గురించి ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. ఆ సమయంలో జయప్రదతో పాటు మిగిలిన ఇద్దరికి కూడా ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టులో తీర్పును (Jaya Prada – Surrender) చెప్పింది.
Also Read: Aamir Khan : చెన్నైకి మకాం మార్చేస్తున్న ఆమీర్.. ఎందుకంటే..?
రూ.20 లక్షలు చెల్లిస్తానన్న జయప్రద
తన మీద నమోదైన కేసుతో పాటు కోర్టు తెలిపిన తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో జయప్రద అప్పీలు చేసుకున్నారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈఎస్‌ఐ బాకీ కింద రూ. 37.28 లక్షలు చెల్లించాలని ఆమెను కోరారు. దీంతో జయప్రద రూ. 20 లక్షలు చెల్లిస్తానని తెలిపారు. దీని గురించి ఈఎస్‌ఐ తరుఫున వాదించే న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారం నాడు జయప్రద పిటిషన్ కొట్టేస్తూ ఈమేరకు తీర్పు వెలువరించింది. 15 రోజుల్లోపు లొంగిపోవడమే కాకుండా వెంటనే రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.