UP : భారీ అగ్నిప్రమాదం…రిటైర్డ్ ఐజీ సజీవదహనం, భార్య, కుమారుడి పరిస్థితి విషమం.!!
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో విషాదం నెలకొంది. రిటైర్డ్ ఐజీ దినేష్ చంద్రపాండే అలియాస్ నాజర్ కాన్పురి ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
- Author : hashtagu
Date : 23-10-2022 - 5:43 IST
Published By : Hashtagu Telugu Desk
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో విషాదం నెలకొంది. రిటైర్డ్ ఐజీ దినేష్ చంద్రపాండే అలియాస్ నాజర్ కాన్పురి ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు భారీగా వ్యాపించాయి. ఇందిరానగర్ లోని సి -బ్లాక్ లో నివాసం ఉంటున్నారు. మంటలు చెలరేగిన సమయంలో రిటైర్డ్ ఐజీ తన భార్య కుమారుడితో కలిసి మొదటి అంతస్తులో ఉన్నారు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అప్పటికే దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో బయటకు వచ్చేందుకు ఛాన్స్ లేకుండా పోయింది. అప్పటికే మంటల్లో చిక్కుకున్న ఐజీ దినేష్ చంద్రా అక్కడిక్కడే మరణించార. ఆయన భార్య కుమారుడు తప్పించుకునేందుకు ఎంతో ప్రయత్నం చేశారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకు్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. ఇంట్లో లోపల ఓ రూంలో పడిఉన్న దినేష్ చంద్రా పాండే ఆతని భార్య కుమారుడిని గుర్తించారు. దినేశ్ చంద్రాపాండే అప్పటికే మరణించారు. ఆయన కుమారుడు, భార్య పరిస్థితి విషయంగా ఉంది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణమేంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.