Delhi Explosion : ఢిల్లీలో భారీ పేలుడు.. రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్
అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు(Delhi Explosion) వెల్లడించారు.
- By Pasha Published Date - 11:49 AM, Sun - 20 October 24

Delhi Explosion : దేశ రాజధాని ఢిల్లీలోని ఒక సీఆర్‌పీఎఫ్ పాఠశాల సమీపంలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. దీంతో దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. దీన్ని చూసి స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఢిల్లీలోని రోహిణి ఏరియా ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ పాఠశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు(Delhi Explosion) వెల్లడించారు. పేలుడు ధాటికి పాఠశాల గోడ, సమీపంలోని దుకాణాలు, కారు ధ్వంసమయ్యాయని చెప్పారు.
Also Read :Israel VS Iran : ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ మెగా ప్లాన్ లీక్
ఈ పేలుడు ఘటనతో సెక్టార్ 14 రోహిణి ఏరియాలోని సీఆర్‌పీఎఫ్ పాఠశాల వద్దకు బాంబు స్క్వాడ్‌లు, పోలీసు ఫోరెన్సిక్ బృందాలు, క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్ అధికారులు, పోలీసు అధికారులు చేరుకున్నారు. ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. సంఘటనా స్థలం నుంచి క్లూస్ సేకరించారు. బాణాసంచా వల్ల పేలుడు సంభవించిందా ? ఏదైనా మందుగుండు సామగ్రి పేలిందా ? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని ప్రజల భద్రతపై ఆందోళన నెలకొంది. విమానాలకు వరుస పెట్టి బాంబు బెదిరింపులు వస్తున్నాయి. రైల్వే ట్రాక్‌లపై అనుమానాస్పద వస్తువులు పెడుతున్నారు. ఈ తరుణంలో ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ పేలుడు అనుమానాలకు తావిస్తోంది.
Also Read :BRICS Vs US Dollar : అమెరికా డాలర్ వర్సెస్ బ్రిక్స్ కరెన్సీ.. పుతిన్ కీలక ప్రకటన
అగ్నిమాపక అధికారుల కథనం ప్రకారం.. ‘‘ఇవాళ ఉదయం 7.50 గంటలకు సీఆర్‌పీఎఫ్ పాఠశాల సరిహద్దు గోడ వద్ద పేలుడు సంభవించింది. ఈవిషయాన్ని మాకు స్థానికులు ఫోన్ కాల్ ద్వారా తెలియజేశారు. మేం వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలను అక్కడికి తీసుకెళ్లాం. పెద్దగా మంటలు వ్యాపించలేదు. ఎవరూ గాయపడలేదు. దీంతో మేం వెంటనే వెనక్కి వెళ్లిపోయాం’’ అని తెలిపారు.