Less painful death : నొప్పిలేని మరణానికి ప్యానెల్, సుప్రీంకు కేంద్రం వినతి
నొప్పి, బాధ లేకుండా మరణించే(Less painful death) మార్గాలను అన్వేషించడానికి కమిటీ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది
- By CS Rao Published Date - 06:14 PM, Tue - 2 May 23

నొప్పి, బాధ లేకుండా మరణించే(Less painful death) మార్గాలను అన్వేషించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అంగీకరిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని సుప్రీం కోర్టుకు(Supreme court) తెలియచేసింది. మరణశిక్ష వేసే సమయంలో ఎలాంటి పద్ధతులను పాటించాలి? అనే దానిపై సరికొత్త మార్గాలను సూచించడం ఆ కమిటీ లక్ష్యం. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో మరణశిక్షను ఎలా అమలు చేస్తున్నారు? బాధకరమైన పద్ధతులకు భిన్నంగా ఉరిశిక్షను ఎలా అమలు చేయాలి? అనే దానిపై కమిటీ అధ్యయనం చేస్తుంది.
నొప్పి, బాధ లేకుండా మరణించే(Less painful death) మార్గాలకు కమిటీ
మరణశిక్ష పద్ధతులను(Less painful death) పరిశీలించడానికి సుప్రీం కోర్టు ఒక ప్యానెల్ ఏర్పాటు చేయనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కుతో పాటు శిక్షించబడిన ఖైదీని గౌరవప్రదంగా ఉరితీసే హక్కు కూడా ఉంది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ తక్కువ బాధాకరంగా ఉండేలా మరణశిక్ష వేయాలని పిటిషనర్ వాదించారు. భారతదేశంలో మరణశిక్ష అమలు విషయంలో తక్కువ బాధాకరమైన పద్ధతులను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నామని కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు (supreme court)తెలిపింది.
ఖైదీని గౌరవప్రదంగా ఉరితీసే హక్కు
ఉరి ద్వారా మరణశిక్షను (Less Painful death)అమలు చేయడంలోని లోతుపాతులను తెలుసుకోవడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. నిపుణుల కమిటీ సభ్యులపై ప్రభుత్వం ఆలోచిస్తోందని, వీలైనంత త్వరగా కమిటీని ఏర్పాటు చేస్తామని ఏజీ ధర్మాసనానికి తెలియచేశారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన ధర్మాసనం విచారణను జూలైకి వాయిదా వేసింది.
Also Read : Supreme Decision: గ్రామ, వార్డు వాలంటీర్ల పై సుప్రీమ్ నిర్ణయం
న్యాయవాది రిషి మల్హోత్రా వ్యక్తిగత హోదాలో ఈ పిటిషన్‌ను ఆయన దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు)ని సూచిస్తుందని, శిక్షించబడిన ఖైదీని గౌరవప్రదంగా ఉరితీసే హక్కును కూడా కలిగి ఉందని వాదించించారు. తద్వారా మరణం తక్కువ బాధాకరంగా మారుతుందని తెలిపారు. ప్రస్తుతం 60 దేశాల్లో ఉరి వేసుకుని మరణించే పద్ధతి ప్రబలంగా ఉంది. మరణశిక్ష విధించే ఇతర పద్ధతుల్లో ప్రాణాంతక ఇంజక్షన్, ఫైరింగ్ స్క్వాడ్ లేదా ఎలక్ట్రిక్ చైర్ ఉన్నాయి. ఉరిని రద్దు చేసి, దానికి బదులుగా విద్యుదాఘాతం, ఫైరింగ్ స్క్వాడ్ లేదా ప్రాణాంతక ఇంజక్షన్‌తో మరణశిక్షను అమలు చేయడానికి ఇష్టపడే పద్ధతిలో దేశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని సుప్రీంకు వివరించారు.
మరణశిక్ష విధించే ఇతర పద్ధతుల్లో ప్రాణాంతక ఇంజక్షన్, ఫైరింగ్ స్క్వాడ్ లేదా ఎలక్ట్రిక్ చైర్
గౌరవప్రదంగా చనిపోవడం(Less Painful death) జీవించే హక్కులో ఒక భాగమని, ప్రస్తుతం అమలులో ఉన్న ఉరితీసే విధానం సుదీర్ఘమైన బాధను కలిగిస్తోందని పిటిషన్‌లో పేర్కొంది.ఉరిశిక్షను వీలైనంత త్వరగా సరళంగా, ఖైదీకి భయాందోళన లేకుండా ఉండాలని కూడా విజ్ఞప్తి చేసింది.
Also Read : Supreme Court Orders: కరోనా టైమ్ లో విడుదలైన ఖైదీలు మళ్లీ జైలుకు రావాలి.. సుప్రీంకోర్టు