Supreme Slams Wikipedia: కోల్‌కతా డాక్టర్ పేరు, ఫోటో తొలగించాలని వికీపీడియాను ఆదేశించిన సుప్రీంకోర్టు
Supreme Slams Wikipedia: అత్యాచారం, హత్య కేసుల్లో బాధితురాలి వివరాలను వెల్లడించలేమని చట్టంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా కోల్‌కతా బాధిత డాక్టర్ వివరాలను తీసివేయాల్సిందిగా వికీపీడియాను సుప్రీంకోర్టు ఆదేశించింది
- By Praveen Aluthuru Published Date - 07:38 PM, Tue - 17 September 24

Supreme Slams Wikipedia: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారం మరియు హత్యకు గురైన రెసిడెంట్ డాక్టర్ ఫోటో మరియు పేరును తొలగించాలని వికీపీడియా (wikipedi)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. వికీపీడియా ఇప్పటికీ బాధితురాలి పేరు మరియు ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్పించిన నివేదికపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం
ఈ నిర్ణయం తీసుకుంది.
అత్యాచారం, హత్య కేసుల్లో బాధితురాలి వివరాలను వెల్లడించలేమని చట్టంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని సుప్రీంకోర్టు (supreme court) పేర్కొంది. ఈ సందర్భంగా బాధిత డాక్టర్ వివరాలను తీసివేయాల్సిందిగా సుప్రీం ఆదేశించింది. కాగా కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో అత్యాచారం మరియు హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోలు మరియు వీడియోలను అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. లైంగిక వేధింపుల బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయడం నిపున్ సక్సేనా కేసులో జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పేర్కొంది.
నిపున్ సక్సేనా కేసులో తన 2018 తీర్పులో అత్యున్నత న్యాయస్థానం ఇలా పేర్కొంది “ఎవరూ బాధితురాలి పేరును ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మొదలైన వాటిలో ప్రచారం చేయకూడదని స్పష్టం చేసింది. కాగా ఆగస్టు 9న ఆసుపత్రి ఛాతీ విభాగంలోని సెమినార్ హాల్‌లో తీవ్ర గాయాలతో ఉన్న ట్రైనీ డాక్టర్ మృతదేహం కనిపించింది. అత్యాచారం-హత్య ఘటనలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ కోల్‌కతా పోలీసులు నిందితుడిని మరుసటి రోజు అరెస్టు చేశారు.కాగా ఈ కేసును సుప్రీం కోర్టు స్వయంగా విచారిస్తుంది. అటు దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసనలు తెలిపారు. అన్ని మేజర్ ఆస్పత్రుల్లో సేవలు నిలిపివేశారు. దీంతో పోలీసులు కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
Also Read: jairam ramesh : మోడీ 3.0.. వందరోజుల పాలన పై జైరాం రమేష్ విమర్శలు