Red Light Area : రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి వచ్చాక.. వైద్యురాలిపై సంజయ్ రాయ్ హత్యాచారం
మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారానికి తెగబడటానికి కొన్ని గంటల ముందు(ఆగస్టు 8న అర్ధరాత్రి) సంజయ్ రాయ్, మరో సెక్యూరిటీ గార్డుతో కలిసి ఓ బైక్‌ను అద్దెకు తీసుకొని కోల్‌కతాలోని సోనాగచి వద్దనున్న రెడ్ లైట్ ఏరియాకు(Red Light Area) వెళ్లాడు.
- Author : Pasha
Date : 21-08-2024 - 10:28 IST
Published By : Hashtagu Telugu Desk
Red Light Area : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న తెల్లవారుజామున జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశంలో కలకలం రేపుతోంది. ఈ కేసు దర్యాప్తు జరిగే కొద్దీ సంచలన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంలో అరెస్టయిన మొదటి నిందితుడు సంజయ్ రాయ్. ఇతడు మెడికల్ కాలేజీ ఔట్ పోస్టు వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తించే వాడు. సంజయ్‌కు సీబీఐ అధికారులు సైకో అనాలిసిస్ టెస్ట్ ఇప్పటికే నిర్వహించారు. త్వరలోనే లై డిటెక్టర్ పరీక్ష కూడా నిర్వహించనున్నారు. ఇప్పటివరకు అతడు పలు కీలక విషయాలను సీబీఐ టీమ్‌కు చెప్పాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి..
కీలక నిందితుడు సంజయ్ రాయ్ ఆగస్టు 8వ తేదీన రాత్రి మెడికల్ కాలేజీలోనే డ్యూటీలో ఉన్నాడు. ఆ రోజు రాత్రి 11 గంటలకు అతడు కాలేజీలోనే మద్యం సేవించాడు. మద్యం తాగుతూ పోర్న్ వీడియోలను అతడు చూశాడు. ఇది పాత విషయమే. కొత్త వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే.. మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారానికి తెగబడటానికి కొన్ని గంటల ముందు(ఆగస్టు 8న అర్ధరాత్రి) సంజయ్ రాయ్, మరో సెక్యూరిటీ గార్డుతో కలిసి ఓ బైక్‌ను అద్దెకు తీసుకొని కోల్‌కతాలోని సోనాగచి వద్దనున్న రెడ్ లైట్ ఏరియాకు(Red Light Area) వెళ్లాడు. అక్కడ ఓ వ్యభిచార నివాసం వద్దకు వీరిద్దరు చేరుకున్నారు. అయితే సంజయ్ రాయ్ లోపలికి వెళ్లలేదు. అతడి మిత్రుడు మాత్రమే లోపలికి వెళ్లి వచ్చాడు. ఈక్రమంలో బయట నిలబడిన సంజయ్ రాయ్.. అటువైపుగా వెళ్తున్న ఒక మహిళను వేధించాడు. న్యూడ్ ఫొటోలు కావాలని ఆమెను సంజయ్ అడిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Also Read :Zakir Naik : తప్పు చేసినట్టు ఆధారాలిస్తే జాకిర్ నాయక్‌ను అప్పగిస్తాం : మలేషియా
ఆగస్టు 9న తెల్లవారుజామున 3.50 సమయంలో..
ఆగస్టు 9న తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో సంజయ్ రాయ్ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు చేరుకున్నాడు. ఆ వెంటనే అతడు ఆపరేషన్ థియేటర్ తలుపును పగులగొట్టాడు. అనంతరం అత్యవసర విభాగంలోకి ప్రవేశించాడు. తదుపరిగా మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్‌లోకి వెళ్లిన సంజయ్ రాయ్.. అక్కడ గాఢ నిద్రలో ఉన్న జూనియర్ వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన గంట సేపటి తర్వాత అతడు సెమినార్ హాలు నుంచి బయటికి వెళ్తుండటం కాలేజీలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది.జూనియర్ వైద్యురాలు సెమినార్ హాల్‌లో చనిపోయిన విషయం ఆగస్టు 9న ఉదయం వెలుగులోకి వచ్చింది.