Bypolls Today : 13 అసెంబ్లీ స్థానాల్లో బైపోల్స్.. 7 రాష్ట్రాల్లో పోలింగ్ షురూ
ఏడు రాష్ట్రాలలోని 13 అసెంబ్లీ స్థానాలకు(13 Assembly Seats) బైపోల్‌లో భాగంగా ఇవాళ పోలింగ్ జరుగుతోంది.
- By Pasha Published Date - 08:54 AM, Wed - 10 July 24

Bypolls Today : ఏడు రాష్ట్రాలలోని 13 అసెంబ్లీ స్థానాలకు(13 Assembly Seats) బైపోల్‌లో భాగంగా ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పలువురు ఎమ్మెల్యేల మరణాలు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కొందరు ఎమ్మెల్యేల రాజీనామాలతో ఈ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందుకే వాటికి బైపోల్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు అనేది జులై 13న జరుగుతుంది. ఇవాళ బైపోల్స్‌లో(Bypolls Today) భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
హిమాచల్ ప్రదేశ్‌లో డెహ్రా, హమీర్పూర్, నలాగర్ అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక జరుగుతోంది. తమిళనాడులోని విక్రవాండి, పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రణఘాట్ దక్షిణ్, బాగ్దా, మానిక్తలా, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగళూర్, పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్, బీహార్‌లోని రూపాలి, మధ్యప్రదేశ్‌లోని అమరవారా అసెంబ్లీ స్థానాల్లో ఇవాళ బైపోల్స్ జరుగుతున్నాయి.
2021 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ మానిక్తలా స్థానాన్ని గెల్చుకుంది. ఆ ఎన్నికల్లో రాయ్‌గంజ్, రణఘాట్ దక్షిణ్, బాగ్దా అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెల్చుకుంది. అయితేే ఆయా స్థానాల ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి టీఎంసీలోకి జంప్ అయ్యారు. ఉత్తరాఖండ్‌లోని మంగ్లౌర్ అసెంబ్లీ స్థానంలో బీఎస్పీ, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. బద్రీనాథ్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రాజేంద్ర భండారీ, కాంగ్రెస్ అభ్యర్థి లఖ్‌పత్ సింగ్ బుటోలా మధ్య పోటీ జరుగుతోంది. పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పోటీ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు ఇవే కావడంతో అన్ని పార్టీలు వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.