Arvind Kejriwal: జైలులో కేజ్రీవాల్ హత్యకు భారీ కుట్ర..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తాజాగా ఆయనను ఈడీ కస్టడీ నుంచి సీబీఐ తమ కస్టడీకి తీసుకుని విచారిస్తుంది. కాగా ప్రస్తుతం కేజ్రీవాల్ షుగర్ సమస్యతో బాధపడుతున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 20-04-2024 - 1:54 IST
Published By : Hashtagu Telugu Desk
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తాజాగా ఆయనను ఈడీ కస్టడీ నుంచి సీబీఐ తమ కస్టడీకి తీసుకుని విచారిస్తుంది. కాగా ప్రస్తుతం కేజ్రీవాల్ షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎంకు ఇంటి భోజనం అవకాశం కల్పించింది కోర్టు. ఇదిలా ఉండగా సీఎం ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ మంత్రి కేజ్రీవాల్ ని హత్య చేసేందుకు యత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశాడు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీ ప్రజలకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తున్న ప్రజలు ఎన్నుకున్న సీఎంకు మందులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేజ్రీవాల్ షుగర్ స్థాయి పెరిగిందని, తనకు ఇన్సులిన్ అవసరమని చెబుతున్నారని, అందుకే ఇన్సులిన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. జైల్లో కేజ్రీవాల్‌ను నెమ్మదిగా హత్య చేసేందుకు పథకం వేశారని ఆందోళన వ్యక్తం చేశాడు.డయాబెటిక్ పేషెంట్‌కు ఇన్సులిన్ ఇవ్వకపోతే అతని నరాలు బలహీనంగా మారుతాయని సౌరభ్ చెప్పారు.నరాల బలహీనత కారణంగా కాలేయం, ఊపిరితిత్తులు మరియు గుండె వంటి శరీరంలోని ప్రతి అవయవం క్రమంగా బలహీన పడుతుందని, అవయవ వైఫల్యం కారణంగా రోగి తన ప్రాణాలను కోల్పోతాడని అన్నారు.కేజ్రీవాల్ విషయంలోనూ ఇదే విధంగా కుట్ర జరుగుతోందని సౌరభ్ ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join
కేజ్రీవాల్ ఆరోగ్యం దెబ్బతినేలా సకాలంలో మందులు ఇవ్వకూడదని కొందరు వ్యక్తులు కోరుతున్నారు. కేజ్రీవాల్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అతనికి కాలేయం, ఊపిరితిత్తులు మరియు గుండెకు చికిత్స తప్పకుండా అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అవసరమైతే ఇన్సులిన్ ఇవ్వాల్సిందేనని సౌరభ్ డిమాండ్ చేశారు.
Also Read; Ganja: రెండు కేజీల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు