Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్, ఆరుగురు మృతి
Helicopter Crash: కేదారనాథ్ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదారనాథ్‌కు బయలుదేరిన హెలికాప్టర్ ఆదివారం ఉదయం గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది.
- By Kavya Krishna Published Date - 10:29 AM, Sun - 15 June 25

Helicopter Crash: కేదారనాథ్ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదారనాథ్‌కు బయలుదేరిన హెలికాప్టర్ ఆదివారం ఉదయం గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. వీరందరూ ఈ ప్రమాదంలో మృతిచెందినట్టు తెలుస్తోంది. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం మరువకముందే ఉత్తరాఖండ్‌లో ఈ ఘోర సంఘటన జరగడం కలకలం రేపుతోంది.
హెలికాప్టర్లు సాధారణంగా కేదారనాథ్ యాత్ర సమయంలో భక్తులను తరలించేందుకు ప్రతిరోజూ పనిచేస్తుంటాయి. అయితే ఈ ఉదయం గౌరీకుండ్ సమీపంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, మేఘాలు, పొగమంచు అధికంగా ఉండటం వల్ల హెలికాప్టర్ అదుపుతప్పి కూలిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే SDRF, రెస్క్యూ బృందాలు, స్థానిక అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే మృతుల పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఈ విషాద ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర స్పందన తెలిపారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన, “రుద్రప్రయాగ జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలిసి మర్మానికి వెళ్లింది. ఇది అత్యంత దురదృష్టకరం. సహాయక బృందాలు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాయి. ప్రయాణికుల సురక్షితత కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
World Wind Day 2025: ప్రపంచ పవన దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!