Kashmiri Pandit Killed : కశ్మీర్ లో ఉగ్రవాదుల ఘాతుకం…కశ్మీరీ పండిట్ కాల్చివేత..!!
జమ్మూకశ్మీర్ లో మరోసారి రెచ్చిపోయారు టెర్రరిస్టులు. ఇద్దరు కశ్మీరీ పండిట్ సోదరులపై కాల్పుల జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
- Author : hashtagu
Date : 17-08-2022 - 8:52 IST
Published By : Hashtagu Telugu Desk
జమ్మూకశ్మీర్ లో మరోసారి రెచ్చిపోయారు టెర్రరిస్టులు. ఇద్దరు కశ్మీరీ పండిట్ సోదరులపై కాల్పుల జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోఫియా జిల్లాలో మంగళవారం జరిగింది. కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని అల్ బదర్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు యాపిల్ తోటలోకి వెళ్లి….అక్కడ పనిచేస్తున్న కూలీలను వరుసగా నిల్చోబెట్టారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అందులో సునీల్ కుమార్, అతని సోదరుడు ప్రతంబర్ కుమార్ భట్ లను కశ్మీరీ పండింట్లగా గుర్తించారు. వారిద్దర్నీ పక్కకు తీసుకెళ్లారు.
అనంతరం వారిని తుపాకితో కాల్చారు. ఈ ఘటనను ఓ ఉగ్రవాది మొబైల్లో చిత్రీకరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను హస్పటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ సునీల్ మరణించాడు. ప్రితంబర్ కుమార్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇక కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదులను దాడులను ఖండిస్తూ స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాగా ఈ సంవత్సరం ఇఫ్పటి వరకు టెర్రరిస్టుల దాడుల్లో 21మంది ప్రాణాలు కోల్పోయారు.