Kangana: ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చింది 1947లో కాదంటున్న కంగనా రనౌత్
వివాదాస్పద వ్యాఖ్యలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్న సినీ నటి కంగనా రనౌత్ మరోసారి సంచలనమైన కామెంట్స్ చేసింది.
- By Hashtag U Published Date - 12:03 AM, Fri - 12 November 21

వివాదాస్పద వ్యాఖ్యలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్న సినీ నటి కంగనా రనౌత్ మరోసారి సంచలనమైన కామెంట్స్ చేసింది.
ఇండియాకి స్వాతంత్య్రం 1947లో రాలేదని, అది కేవలం బిక్షమాత్రమే అని కంగనా తెలిపింది. కాంగ్రెస్ హయాంలో కూడా బ్రిటీష్ పాలనే కొనసాగిందనీ, 2014లో(మోదీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం)
నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని పేర్కొంది. కంగనా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కంగనా కామెంట్స్ పై సాధారణ ప్రజలే కాకుండా రాజకీయనాయకులు కూడా స్పందిస్తున్నారు.
1947లో స్వాతంత్ర్యం తేవడానికి
త్యాగాలు చేసిన వారిని కంగనా తీవ్రంగా అవమానించిందని నెటిజన్లు మండి పడుతున్నారు.
సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ కంగనాని విలాసవంతమైన బెగ్గర్ అని విమర్శించారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కంగనా రనౌత్‌పై సీరియస్ అయ్యారు. కంగనాది
పిచ్చా లేక దేశద్రోహమా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బీజేపీ మద్దతుదారులు మహాత్మాగాంధీ త్యాగాలను అవమానించడమే కాకుండా, గాంధీజీని హత్యచేసిన గాడ్సేను పొగిడారు. ఇపుడు స్వాతంత్ర్య సమరయోధులు మంగళ్ పాండే, రాణి లక్ష్మీభాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి లక్షలాది మంది వీరులను అగౌరవ పర్చడం సరికాదని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.
ఏ పార్టీకైనా మద్దతిచ్చే హక్కు కంగనాకు ఉంది. కానీ దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన వారిని కించపరిచడం సరైంది కాదేమో పద్మశ్రీ కంగనా.
Related News

Modi to Lord Rama: నరేంద్రమోదీని శ్రీరాముడితో పోల్చిన కంగనా
ప్రధానమంత్రి నరేంద్రమోదీని శ్రీరాముడితో పోల్చారు నటి కంగనా రనౌత్. ఈ రోజు ప్రధాని మోడీ తన 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని మోడీకి కంగనా శుభాకాంక్షలు తెలిపింది.