Kamal Haasan : కేంద్రంపై కమల్ ఫైర్
Kamal Haasan : ప్రముఖ నటుడు మరియు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
- By Sudheer Published Date - 01:41 PM, Sat - 22 February 25

తమిళనాడులో జాతీయ విద్యా విధానం (NEP) అమలుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య వాగ్వాదం మళ్లీ ఉత్కంఠకు దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు మరియు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ (Kamal Hassan) కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన, తమిళ భాషపై కేంద్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా విమర్శించారు. “తమిళీయులు తమ భాష కోసం ప్రాణాలు అర్పించారు. తమిళ భాషను చిన్నచూపు చూడటం సరే కాదు” అని ఆయన అన్నారు.
Jagan Marks Justice: వంశీ, పిన్నెల్లికి ఒక రూల్.. నందిగంకి మరో రూల్, జగన్ మార్క్ న్యాయం!
ఈ సందర్భాంగా తన రాజకీయ జీవితాన్ని కూడా ప్రస్తావించారు. “నేను ఆలస్యంగా రాజకీయాల్లోకి వచ్చానని అనిపిస్తుంది. 20 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి ప్రవేశించి ఉంటే నా స్థానం మరింత పెరిగి ఉండేది” అని చెప్పారు. తమిళనాడులో పిల్లలు తమ భాషను ఎంచుకునే విషయంలో సరైన పరిణతి పొందిన వారిగా ఆయన అభిప్రాయపడ్డారు. “తమిళ భాషపై కేంద్రం చేసే సవాలు అనేది తమకు అంగీకరించనిది” అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళ భాషా జ్ఞానానికి సంబంధించిన తీవ్రమైన చర్చను మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది.
Free Health Insurance: ఏపీలో విప్లవాత్మకమైన నిర్ణయం.. అందరికీ ఉచిత ఆరోగ్య బీమా!
అలాగే కమల్ హాసన్ తన పార్టీ అభివృద్ధిపై కూడా మాట్లాడారు. 2026 అసెంబ్లీ ఎన్నికలపై ఆయన అభిప్రాయపడ్డారు. “మా పార్టీ చిన్నదిగా ఉండవచ్చు, కానీ ఈ సంవత్సరం పార్లమెంట్‌లో మా గొంతు వినిపిస్తాం. వచ్చే ఏడాది అసెంబ్లీలో కూడా మా ప్రతిభ కనబరుస్తాం” అని చెప్పారు. 2026 ఎన్నికల్లో తన పార్టీ విజయం కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కమల్ హాసన్ సూచించారు. వ్యతిరేకులు తనపై చేసిన విమర్శలకు స్పందిస్తూ, “ఫెయిల్డ్ పొలిటిషియన్” అనే మాటలు తనకు పెద్దగా పట్టవని ఆయన తెలిపారు.