New Delhi : తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు..!!
సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా డీవై చంద్రచూడ్ నవంబర్ 9న బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ నవంబర్ 8వ తేదీన విరమణ చేయబోతున్నారు.
- By hashtagu Published Date - 09:16 PM, Mon - 17 October 22

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా డీవై చంద్రచూడ్ నవంబర్ 9న బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ నవంబర్ 8వ తేదీన విరమణ చేయబోతున్నారు. ఆయన తర్వాత చీఫ్ జస్టిస్ గా నియమించడానికి జస్టిస్ చంద్రచూడ్ ను జస్టిస్ యూయూ లలిత్ న్యాయశాఖకు సిఫార్సు చేశారు. జస్టిస్ యూయూ లలిత్ సీజేఐగా కేవలం 74రోజులు మాత్రమే ఉంటున్నారు. జస్టిస్ చంద్రచూడ్ ప్రధానన్యాయమూర్తిగా రెండేళ్లు కొనసాగనున్నారు 2024 నవంబర్ 10 వతేదీన జస్టిస్ చంద్రచూడ్ విరమణ చేస్తారు.
జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా ప్రధానన్యాయమూర్తిగా కొనసాగారు. ప్రధానన్యాయమూర్తులుగా పదవి చేపట్టిన తండ్రీకొడుకులు వీరే. మాజీ సీజేఐ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ 1978లో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1985లో పదవీ విరమణ చేశారు. సీజేఐగా అత్యధిక కాలం 7 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి కూడా ఆయనే.
జస్టిస్ డివై చంద్రచూడ్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో రెండు డిగ్రీలు అందుకున్నారు. 39ఏళ్ల వయస్సులోనే అతను సీనియర్ న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కలలో ఒకరు. 1998లో భారత అదనపు సొలిసిటర్ జనరల్ గా నియమితులయ్యారు. న్యాయవాదిగా ఓక్లహోమా యూనివర్సిటీలో అంతర్జాతీయ న్యాయశాస్త్రాన్ని బోధించారు. 1988 నుంచి 1997 వరకు ముంబై యూనివర్సిటీలో తులనాత్మక రాజ్యంగ చట్టంలో గెస్ట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. బాంబే హైకోర్టులో 13 సంవత్సరాలుగా పనిచేశారు. 2013లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మూడేళ్ల తర్వాత సుప్రీంకోర్టుకు సీజేఐగా పదోన్నతి పొందారు.