HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Jobs In Air Force With Inter And Degree Qualifications

Air Force : భారీగా శాలరీస్.. ఎయిర్ ఫోర్స్‌లో, బీఎస్ఎఫ్‌లో జాబ్స్

ఇంటర్‌లో ఎంపీసీ, బ్యాచిలర్‌ డిగ్రీ, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత కలిగిన వారికి గుడ్ న్యూస్.

  • By Pasha Published Date - 09:04 AM, Mon - 3 June 24
  • daily-hunt
Indian Air Force
Indian Air Force

Air Force : ఇంటర్‌లో ఎంపీసీ, బ్యాచిలర్‌ డిగ్రీ, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత కలిగిన వారికి గుడ్ న్యూస్. కొన్ని శారీరక ప్రమాణాలు ఉంటే చాలు ఎయిర్ ఫోర్స్‌లో(Air Force) మంచి జాబ్ వస్తుంది. ఫ్లయింగ్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైతే రూ.56,100 – రూ.1,77,500 వరకు నెలవారీ పే స్కేలును అందుకోవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జూన్​ 28. ఇంత గొప్ప జాబ్ ఆఫర్‌పై వివరాలివీ.

We’re now on WhatsApp. Click to Join

ఇండియన్ ఎయిర్​ఫోర్స్​ కామన్ ఎంట్రన్స్ టెస్ట్​ (AFCAT -02/2024) నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి ఎంపికయ్యే వారికి ​ 2025 జులై నుంచి కోర్సును ప్రారంభిస్తారు. ఇందులోని ఏఎఫ్‌క్యాట్‌ ఎంట్రీ  విభాగంలో ఫ్లయింగ్/ గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌), గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌- టెక్నికల్‌) అనే రెండు రకాల పోస్టులు ఉంటాయి. ఇక ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ విభాగంలో ఫ్లయింగ్ ఆఫీసర్ అనే మరో పోస్టు ఉంటుంది. ఫ్లయింగ్ ఆఫీసరు విభాగంలో చేరే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి.గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్-టెక్నికల్) బ్రాంచ్‌ అభ్యర్థుల వయస్సు 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. ఆన్‌లైన్‌ పరీక్ష, స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్​లైన్ పరీక్షలు ఆగస్టు 9, 10, 11 తేదీల్లో జరుగుతాయి. వీటిలో ఎంపికయ్యే వారికి ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం పరీక్ష పెడతారు. వైద్యపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన చేసి, ఎంపికయ్యే వారికి ట్రైనింగ్ ఇస్తారు.

Also Read : Telangana Rains : ఇవాళ, రేపు ఈ జిల్లాలకు వర్ష సూచన

బీఎస్ఎఫ్‌లో జాబ్స్

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో​ పారా మెడికల్ స్టాఫ్ గ్రూప్-బి, గ్రూప్​-సి (నాన్-గెజిటెడ్ నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టులను భర్తీ చేస్తున్నారు.  మొత్తం 144 పోస్టులు ఉండగా.. అత్యధికంగా 47 ఏఎస్​ఐ ఫిజియోథెరపిస్ట్​ పోస్టులు, 38 ఏఎస్​ఐ ల్యాబ్ టెక్నీషియన్​​ పోస్టులు,  34 కానిస్టేబుల్​ టెక్నికల్ పోస్టులు, 14 ఎస్​ఐ స్టాఫ్​ నర్స్ పోస్టులు ఉన్నాయి. బీఎస్​ఎఫ్ ఇన్​స్పెక్టర్ పోస్టులు  2, ఎస్​ఐ వెహికల్ మెకానిక్ పోస్టులు 3,  హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ పోస్టులు 4, కానిస్టేబుల్ కెన్నెల్​మాన్​ పోస్టులు 2 ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 17.

Also Read : Tractor Trolley Overturns : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్​ బోల్తా.. 13 మంది మృతి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Air Force
  • Degree
  • Inter
  • jobs

Related News

    Latest News

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd