Jio Cinema : జియో సినిమా సరికొత్త ప్లాన్.. IPL ఫ్రీ.. కానీ సినిమాలకు డబ్బులు కట్టాలి..
జియో స్టూడియోస్ తరపున ముంబైలో ఓ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో త్వరలో జియో సినిమా నుంచి బోలెడంత కంటెంట్ ని ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు.
- Author : News Desk
Date : 15-04-2023 - 5:53 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ సంవత్సరం IPL 2023 ప్రసార హక్కులను రిలియన్స్(Reliane)కు చెందిన వయాకామ్ 18(Viacom 18) సంస్థ దక్కించుకొని జియో సినిమా(Jio Cinema) ద్వారా ఉచితంగా ప్రసారం చేస్తుంది. మన దేశంలో ఎంతో క్రేజ్ ఉన్న IPL ని ఉచితంగా ప్రసారం చేయడంతో జియో సినిమాకు తీవ్ర ఆదరణ కనపడుతుంది. రికార్డు స్థాయిలో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. IPLను ఒక్క జియో కస్టమర్స్ కి మాత్రమే కాకుండా వేరే టెలికం కస్టమర్స్ కి కూడా ఫ్రీగా ప్రసారం ఇవ్వడంతో IPLకు ఈ సారి ఎన్నడూ లేని రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
అయితే తాజాగా జియో స్టూడియోస్ తరపున ముంబైలో ఓ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో త్వరలో జియో సినిమా నుంచి బోలెడంత కంటెంట్ ని ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే బాలీవుడ్, రీజనల్ సినీ పరిశ్రమల నుంచి 100 పెద్ద పెద్ద సినిమాలు, సిరీస్ లతో అవి థియేట్రికల్ రిలీజ్ అయ్యాక జియో సినిమాలో రిలీజ్ అయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కొన్ని కంటెంట్స్ మాత్రం డైరెక్ట్ జియో సినిమాస్ లో రిలీజ్ చేయబోతున్నారు.
నెట్ ఫ్లిక్స్, అమెజాన్.. లాంటి పలు ఓటీటీల లాగే జియో సినిమాని కూడా ప్రముఖ ఓటీటీలా తయారు చేయాలని చూస్తున్నారు నిర్వాహకులు. జియో సినిమాస్ ద్వారా IPL ని అయిదు సంవత్సరాలు ఫ్రీగా ప్రసారం చేయనున్నారు. దీంతో ఈ ఐదేళ్లలో జియో సినిమా మీద ఫోకస్ పెట్టనున్నారు. IPL ఫ్రీగా ఇస్తున్న నేపథ్యంలో జియో సినిమాలోని సినిమాలకు, వేరే కంటెంట్ కు డబ్బులు వసూలు చేస్తామని రిలయన్స్ మీడియా, కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే తెలిపారు.
సినిమాలు, కంటెంట్ యాడ్ చేశాకే చార్జీలు వసూలు చేస్తామని జియో నిర్వాహకులు తెలిపారు. దీంతో ఇది వచ్చే సంవత్సరం నుంచి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. జియో స్టూడియోస్ తరపున ఇప్పటికే కంటెంట్ ను డెవలప్ చేసే పనిలో ఉన్నారు. కంటెంట్ కి సంబంధించి పలువురు ఉద్యోగులను కూడా జియో స్టూడియోస్.. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ సంస్థల నుంచి తీసుకోవడం విశేషం.
Also Read : Shaakuntalam Disappointed: సమంత కు షాక్.. ఘోరంగా నిరాశపర్చిన శాకుంతలం!