Shaakuntalam Disappointed: సమంత కు షాక్.. ఘోరంగా నిరాశపర్చిన శాకుంతలం!
శాకుంతలం (Shaakuntalam) మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందని అభిమానులతో పాటు బయ్యర్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
- By Balu J Published Date - 03:12 PM, Sat - 15 April 23
ఒకవైపు భారీ చిత్రాల డైరెక్టర్ గుణశేఖర్ (Gunshekar), మరోవైపు పేరున్న నిర్మాత దిల్ రాజు (Dil Raju), ఇంకోవైపు స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కాంబినేషన్ లో తెరకెక్కిన శాకుంతలం (Shaakuntalam) మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందని అభిమానులతో పాటు బయ్యర్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైన మూవీ ఫస్ట్ రోజుకే డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాదాపు 70 కోట్లకుపైగా నిర్మించిన ఈ మూవీకి ఓపెనింగ్ కలెక్షన్స్ లేక ఫేడ్ ఔట్ అయ్యింది.
కొన్ని ఏరియాలో షోలు కూడా క్యాన్సిల్ చేశారంటూ వార్తలు కూడా వచ్చాయి. శాకుంతలం మూవీని చూసినా అభిమానులు యశోద (Yashoda) మూవీనే చాలా బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ ఉత్తరాంధ్రలో పట్టుమని 14 లక్షలు షేర్ (Collections) రాలేకపోయింది. దీనికన్నా యశోద నే బెటర్ 16 లక్షలు రాబట్టింది. నైజాంలో డెభై నుంచి ఎనభై లక్షల వరకు వచ్చిందని తెలుస్తోంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఫస్ట్ డే గ్రాస్ కేవలం 4 కోట్ల 70 లక్షలు మాత్రమేనట. షేర్ రూపంలో చూసుకుంటే 2 కోట్ల 22 లక్షల దాకా తేలుతుంది. ఇది మాములుగా చిన్న బడ్జెట్ సినిమాలకు డీసెంట్ ఫిగర్. కానీ ప్యాన్ ఇండియా రేంజ్ లో హంగామా చేసి వివిధ భాషల్లో ఒకేరోజు గ్రాండ్ రిలీజ్ జరుపుకున్న శాకుంతలం స్థాయికి ఏ మాత్రం సరితూగని నెంబర్లు ఇవి.
మార్కెటింగ్ లేదా పబ్లిసిటీ లేదా ప్రీమియర్ ప్లానింగ్ ఎక్కడో బెడిసి కొట్టేసింది. ఓపెనింగ్ రాకుండా అయిపోయింది. దీంతో సినిమా మాకొద్దు అంటే మాకొద్దు అని బయ్యర్లు అనడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంటున్న సమంతకు శాకుంతలం మూవీతో బిగ్ షాక్ (Shock) తగిలినట్టేనని చెప్పక తప్పదు. మంచి స్టార్ కాస్ట్, మంచి కథ, నిర్మాణ విలువలు ఉన్నప్పటికీ శాకుంతలం మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది.
మరోవైపు, వాస్తవానికి సూపర్ టాలెంటెడ్ అయిన చాలా మంది దర్శకులు టాలీవుడ్ లో ఉన్నారు. అయితే క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్‌లను సరైన రీతిలో డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే దర్శకులు VFX, CG ఆధారిత సినిమాలు చేయడానికి ప్రయత్నించినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. గుణశేఖర్ ఇప్పటికే రెండు సార్లు చేశాడు. ఇప్పటికైనా ఆపేస్తే మంచిదని అంటున్నారు తెలుగు ఫ్యాన్స్.
Also Read: Rashmika Kiss: అభిమానులకు ముద్దు పెట్టిన రష్మిక.. రియాక్ట్ అయిన నెటిజన్స్!
Related News
Malavika Mohanan : అనుష్క, సమంత ఇద్దరూ ఇష్టమే అంటున్న రాజా సాబ్ బ్యూటీ..!
Malavika Mohanan మాళవికకు ఇష్టమైన తెలుగు హీరోయిన్స్ గురించి ఒక ఫాలోవర్ అడిగాడు. అందుకు అమ్మడు సమాధానంగా అనుష్క, సమంత