PM Modi : మోడీజీ ఇది ట్రైలర్.. జైరాం రమేష్ విమర్శలు
ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత తొలి రెండు గంటల పాటు వారణాసి లోక్‌సభ స్థానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెనుకంజలో ఉండిపోయారు.
- Author : Pasha
Date : 04-06-2024 - 11:51 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi : ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత తొలి రెండు గంటల పాటు వారణాసి లోక్‌సభ స్థానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెనుకంజలో ఉండిపోయారు. ఆ సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కు 11వేలకుపైగా ఓట్లు రాగా, ప్రధాని మోడీకి 6000లోపు ఓట్లు వచ్చాయి. ఈనేపథ్యంలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది ట్రైలర్ మాత్రమే. ఇంకా ముందు పెద్ద సినిమా ఉంది’’ అని ఆయన కామెంట్ చేశారు. ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో ప్రధాని మోడీ ఎప్పుడూ ఇది ‘ట్రైలర్’ అనే పదాన్ని ప్రయోగిస్తుంటారని జైరాం రమేష్ గుర్తించారు.
We’re now on WhatsApp. Click to Join
ఇక 11.30 గంటల తర్వాత వారణాసిలో ఓట్ల లెక్కింపు సీన్ మరో మలుపు తిరిగింది. ప్రధాని మోడీ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. తాజా సమాచారం ప్రకారం ప్రధాని మోడీ ప్రస్తుతం 600 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఓవరాల్‌గా ప్రస్తుత సమాచారం ప్రకారం ఎన్డీఏ కూటమి 274 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇండియా కూటమి 202 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 22 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు.