HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Is Eastern Army Command The Key To Becoming Indian Army Chief

Eastern Army: అనుభవజ్ఞులకే ఆర్మీ చీఫ్ పదవులు!

ఆర్మీ చీఫ్‌ పదవికి సైన్యాధికారులను ఎంపిక చేసేందుకు భారత్ "లుక్ ఈస్ట్" పాలసీ అవలంభిస్తోందా ?

  • Author : Hashtag U Date : 22-04-2022 - 2:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Army Chief
Army Chief

ఆర్మీ చీఫ్‌ పదవికి సైన్యాధికారులను ఎంపిక చేసేందుకు భారత్ “లుక్ ఈస్ట్” పాలసీ అవలంభిస్తోందా ? ఈస్టర్న్‌ (తూర్పు) ఆర్మీ కమాండ్‌ కు నేతృత్వం వహించిన అనుభవం ఉన్నవాళ్లనే ఆ పోస్టుకు పరిశీలిస్తోందా ? అంటే.. పలువురు పరిశీలకులు “ఔను” అనే సమాధానమే చెబుతున్నారు. ఇక్కడ “ఈస్ట్” అంటే.. ఈస్టర్న్‌ (తూర్పు) ఆర్మీ కమాండ్‌. కీలకమైన చైనా సరిహద్దులలో భద్రతా వ్యవహారాలన్నీ ఇదే చూస్తుంది.
మనదేశ కొత్త ఆర్మీ చీఫ్‌ గా ఈనెలాఖరు లో బాధ్యతలు స్వీకరించనున్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ప్రస్తుతం ఆర్మీ వైస్‌ చీఫ్‌ హోదాలో ఉన్నారు. అయితే ఆయన గతంలో ఈస్టర్న్‌ ఆర్మీ కమాండ్‌కు నేతృత్వం వహించారు.

లద్ధాఖ్ లోని 8 మౌంటెన్ డివిజన్ కు, తేజ్ పూర్ 4 కార్ప్స్ కు, అండమాన్ నికోబార్ ఐలాండ్ కమాండ్ కు కూడా సారధ్యం వహించిన అనుభవం ఆయన సొంతం. అండమాన్ నికోబార్ ఐలాండ్ కమాండ్ కు నేతృత్వం వహించినందున చైనా నౌకాదళం వ్యూహాలపైనా మనోజ్ పాండే కు అవగాహన వచ్చింది. 2020 ఏప్రిల్ లో భారత్ – చైనా మధ్య తూర్పు లద్ధాఖ్ ప్రతిష్టంభన మొదలైనప్పటి నుంచి చోటుచేసుకున్న పరినామాలను ఈస్టర్న్‌ ఆర్మీ కమాండ్‌ నుంచి ఆయన నేరుగా పర్యవేక్షించారు. ఈక్రమంలో సిక్కిం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు చైనా సైన్యం సాగించిన కదలికలనూ మనోజ్ పాండే చూశారు. ఈస్టర్న్‌ ఆర్మీ కమాండ్‌ కు నేతృత్వం వహించిన ఎంతోమంది గతంలో ఆర్మీ చీఫ్‌ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.

ఈ జాబితాలో వీ.కే. సింగ్, మనోజ్ ముకుంద్ నరవనే కూడా ఉన్నారు. ఇక మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఈస్టర్న్‌ ఆర్మీ కమాండ్‌ లో ఎన్నడూ పని చేయలేదు. అయినా.. చైనా సరిహద్దులపై ఆయనకు అద్భుతమైన పట్టు ఉంది. 2015 సంవత్సరం లో మయన్మార్ లోని ఉగ్రవాదుల పై దాడి చేసిన నాగాలాండ్ లోని దిమాపూర్ -3 కార్ప్స్ కు నేతృత్వం వహించింది బిపిన్ రావతే. డోక్లామ్ ప్రాంతంలో చైనా సైన్యాన్ని తిప్పికొట్టే వ్యూహాలు రచించింది కూడా ఆయనే. 1987 సంవత్సరం లో చైనా – భారత్ మధ్య జరిగిన “సందొరుంగ్ చు” ఘర్షణ ల్లో చైనా సైన్యం వ్యవహార శైలిని నేరుగా చూసిన అనుభవం బిపిన్ రావత్ కు ఉంది. గత 2 దశాబ్దాల్లో భారత ప్రభుత్వం ప్రధాన దృష్టి పాక్ సరిహద్దుల నుంచి చైనా సరిహద్దులకు మారింది. ఈ నేపథ్యంలో ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ లో ఆరితేరిన వారికే ఆర్మీ చీఫ్ ఇస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలోనే మనోజ్ పాండే కు కూడా అవకాశం దక్కిందని విశ్లేషిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bipin Rawat
  • india
  • Indian army
  • pm cares

Related News

Iran

ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులు.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం జారీ చేసిన అధికారిక అడ్వైజరీలో.. విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు కమర్షియల్ విమానాలు లేదా ఇతర అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్ విడిచి వెళ్లాలని కోరింది.

  • Train Routes

    భారతదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలివే!!

  • Grok AI

    ఎక్స్ కీలక నిర్ణయం.. భారత ప్రభుత్వ ఆదేశాలతో అభ్యంతరకర కంటెంట్‌పై వేటు!

  • Indian Army

    అంతర్జాతీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత రక్షణ బడ్జెట్ పెరుగుతుందా?

  • Silver

    బంగారం తరహాలో వెండికీ హాల్‌ మార్కింగ్ తప్పనిసరి‌..కేంద్రం కీలక నిర్ణయం

Latest News

  • మ‌న‌కు తెలియకుండానే మ‌న దంతాలను మ‌నం పాడుచేసుకుంటున్నామా?

  • కొత్త క‌ల‌ర్స్‌లో సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250.. ధ‌ర ఎంతంటే?

  • మెగాస్టార్ సినిమాకు కొత్త స‌మ‌స్య‌.. ఏంటంటే?

  • హీరోగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల!

  • బడ్జెట్ 2026.. ప్ర‌ధాన మార్పులివే?!

Trending News

    • ఇరాన్‌లో 3,428 మంది మృతి.. ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!!

    • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

    • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

    • మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd