HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Irctc Pantry Service

IRCTC : రైలు ప్రయాణికులకు ఇకపై ఆ బాధ ఉండదు..ఎందుకంటే !!

IRCTC : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవను ప్రారంభించింది.

  • Author : Sudheer Date : 02-06-2025 - 10:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IRCTC
IRCTC

రైల్లో దూరం ప్రయాణం చేసేవారికి ప్రధాన సమస్య ఫుడ్(Food). రైల్లో అందించే ఫుడ్ ఏమాత్రం బాగోదు. రుచి లేని భోజనం ఇవ్వడం వల్ల ప్రయాణికులు భోజనం చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇకపై ఆ బాధ అవసరం లేకుండా ఇకనుంచి శుభ్రమైన, రుచికరమైన భోజనం వారి సీటు వద్దే అందుబాటులోకి రానుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవను ప్రారంభించింది. గతంలో ఈ సేవలు కేవలం ప్రీమియం రైళ్లకే పరిమితమయ్యే. ఇప్పుడు సాధారణ ప్రయాణికులకు కూడా తక్కువ ధరకు నాణ్యమైన భోజనం పొందే అవకాశం లభించనుంది. అధిక ఛార్జీలు, నాసిరకం ఆహారం వల్ల ఎదురయ్యే సమస్యలకు పరిష్కారమవుతుంది.

Telangana Formation Day : తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్‌ ప్రణాళికలు: సీఎం రేవంత్‌ రెడ్డి

ఈ-ప్యాంట్రీ అనేది IRCTC అందిస్తున్న డిజిటల్ ఆన్‌లైన్ ఫుడ్ బుకింగ్ సదుపాయం. మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కన్ఫర్మ్డ్, RAC లేదా పాక్షికంగా కన్ఫర్మ్ అయిన టికెట్ ఉన్న ప్రయాణికులు ఈ సేవను వినియోగించుకోవచ్చు. టికెట్ బుకింగ్ సమయంలో లేదా అనంతరం ‘బుక్డ్ టికెట్ హిస్టరీ’లో ఈ-ప్యాంట్రీ ఎంపిక చేసి ఆహారాన్ని బుక్ చేయవచ్చు. బుకింగ్ అనంతరం ప్రయాణికులకు ఒక మీల్ వెరిఫికేషన్ కోడ్ (MVC) లభిస్తుంది. ఈ కోడ్‌ను చూపించడం ద్వారా సీటు వద్దే భోజనం అందుతుంది.

ఈ సేవ ద్వారా ప్రయాణికులు ఆన్‌లైన్ ఫుడ్ బుకింగ్, డిజిటల్ పేమెంట్స్, నిర్దిష్ట ధర, IRCTC లైసెన్స్ పొందిన విక్రేతల నుండి మాత్రమే సేవల లభ్యత వంటి ప్రయోజనాలు పొందగలరు. భోజనం డెలివరీ కాకపోతే డబ్బులు తిరిగి లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సేవను వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలుతో ప్రారంభించి, రాబోయే 60 రోజుల్లో మరో 25 రైళ్లకు విస్తరించనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా మరిన్ని రైళ్లలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్టు IRCTC ప్రకటించింది. ఇది రైలు ప్రయాణ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే కొత్త ముందడుగు అని చెప్పవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Delivery Code
  • IRCTC
  • irctc Pantry service
  • online food
  • passengers
  • Train Food

Related News

    Latest News

    • రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీ నుంచి రెండో సాంగ్ విడుద‌ల‌!

    • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

    • ఖ‌మేనీ భార్య కూడా క‌న్నుమూత‌!

    • అంపైర్‌గా మారిన ఎంఎస్ ధోనీ.. వైర‌ల్ వీడియో ఇదే!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైన‌ల్ మ్యాచ్‌ల వేదిక‌లు ఖ‌రారు.. ఎక్క‌డంటే?

    Trending News

      • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

      • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

      • మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

      • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

      • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd