Insurance: జనవరి 1, 2023 నుంచి మారే రూల్స్ ఇవే.. వెంటనే తెలుసుకోండి!
కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు చాలా మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆర్థిక రంగంలో కొత్త రూల్స్ వస్తుంటాయి.
- By Anshu Published Date - 09:27 PM, Fri - 30 December 22

Insurance: కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు చాలా మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆర్థిక రంగంలో కొత్త రూల్స్ వస్తుంటాయి. అవేంటో మీరు తెలుసుకుంటే కొన్ని ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు. జనవరి 1వ తేది నుండి అమలులోకి వచ్చే మార్పులేంటో ఒకసారి చూద్దాం.
బీమా పాలసీలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లను గుర్తించడానికి కేవైసీ పత్రాలు 2023 జనవరి నుంచి కేంద్రం తప్పనిసరి చేసింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా ‘ఐఆర్డీఏఐ’ బీమా కంపెనీలు లైఫ్, ఆరోగ్యం, మోటార్, ఇల్లు, ప్రయాణం వంటి అన్ని రకాల బీమా పాలసీలను విక్రయించేందుకు యూజర్ల నుంచి కేవైసీ పత్రాలను సమర్పించాలని కేంద్రం తెలిపింది.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి స్వీయ అఫిడవిట్ ద్వారా ఆన్ లైన్ పాక్షిక ఉపసంహరణ సౌకర్యం ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులో ఉండనుంది. జనవరి 2021లో కోవిడ్ మహమ్మారి వల్ల ఆన్‌లైన్ ద్వారా పెన్షన్ పొదుపులను పాక్షికంగా ఉపసంహరించుకునే సౌకర్యాన్ని కేంద్రం కల్పించనుంది.
కార్పొరేట్‌తో సహా ఇతర వర్గాలకు చెందిన ఎన్పీఎస్ సబ్‌స్క్రైబర్ల స్వీయ-ధృవీకరించబడిన స్టేట్‌మెంట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉపసంహరణలు చేయడానికి అనుమతించే అవకాశాన్ని కల్పించనుంది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లు ఇకపై అద్దె చెల్లింపు లావాదేవీల కోసం రివార్డ్ పాయింట్లను అనుమతించే అవకాశం లేదని వెల్లడించింది.
జనవరి నుంచి SmartBuy ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా విమాన టిక్కెట్లు, హోటల్ రూమ్‌లను బుక్ చేయడం ద్వారా పొందే రివార్డ్ పాయింట్ల నెలవారీ రిడెంప్షన్‌ను HDFC బ్యాంక్ పరిమితం చేసినట్లు తెలిపింది. దీంతో ఇన్ఫినియా కార్డ్‌లకు 1,50,000 రివార్డ్ పాయింట్లు, డైనర్స్ బ్లాక్ కేటగిరీ కార్డ్‌లకు 75,000 రివార్డ్ పాయింట్లు, ఇతర కార్డులకు 50,000 రివార్డ్ పాయింట్లు వచ్చే అవకాశం ఉంది.
SBI కార్డ్‌ల ద్వారా Amazon.inలో ఆన్‌లైన్ లావాదేవీలు జరిపితే ఇకపై ‘5X’కి పాయింట్లు తగ్గించబడతాయని ఎస్బీఐ తెలిపింది. అయితే Apollo 24×7, BookMyShow, Cleartrip, EasyDiner, Lineskart, NetMedsలో ఆన్‌లైన్ లావాదేవీలు ఒక్కొక్కటి 10X రివార్డ్ పాయింట్లను పొందే అవకాశం ఉంటుందని ఎస్బీఐ తెలిపింది.