Infosys STEM Stars : ఆడపిల్లల చదువుకు ఏడాదికి లక్ష స్కాలర్‌షిప్.. ప్రకటించిన ఇన్ఫోసిస్
Infosys STEM Stars : సోషల్ సర్వీస్ లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇప్పటికే ఎంతో కృషి చేస్తోంది. బలహీన వర్గాల ఆడపిల్లల విద్య కోసం తాజాగా ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది.
- By Pasha Published Date - 09:20 AM, Fri - 18 August 23

Infosys STEM Stars : సోషల్ సర్వీస్ లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇప్పటికే ఎంతో కృషి చేస్తోంది.
బలహీన వర్గాల ఆడపిల్లల విద్య కోసం తాజాగా ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది.
బాలికల చదువుకు స్కాలర్ షిప్ ఇచ్చేటందుకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తామని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రకటించింది.
ఇందుకోసం “ఇన్ఫోసిస్ ఫౌండేషన్” ఆధ్వర్యంలో “స్టెమ్ స్టార్స్” (STEM Stars) పేరుతో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను త్వరలోనే ప్రారంభించనుంది.
Also read : Teeth Fall In Dream : దంతాలు ఊడిపోతున్నట్టు కల వచ్చిందా.. దాని అర్ధం ఇదే !
ఆడపిల్లల చదువు వారి పిల్లల జీవితంపై ప్రభావం చూపుతుందని, ఆడపిల్లలు చదువుకుంటే యావత్ దేశం సంపూర్ణ అక్షరాస్యత దిశగా వెళ్తుందని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆ సంకల్పంతోనే ‘స్టెమ్ స్టార్స్’ స్కాలర్‌షిప్‌ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. “స్టెమ్ స్టార్స్” స్కాలర్‌షిప్‌ల ద్వారా బాలికల చదువుకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. బాలికల చదువులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అవసరమైన ట్యూషన్ ఫీజు, వసతి ఖర్చులు, స్టడీ మెటీరియల్ ఇలా.. అన్నింటికీ కలిపి ఏడాదికి లక్ష రూపాయలు చొప్పున నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వివరించింది.
ఈ కాలేజీల్లో తొలి విడత..
ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ (Infosys STEM Stars) తొలి దశలో భాగంగా 2,000 మందికిపైగా బాలికల చదువుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చేయూత అందించనుంది. దేశంలోని ప్రముఖ కళాశాలల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం ఏ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించినా.. ఫౌండేషన్ ద్వారా ఆర్ధికసాయం పొందుతారు.తొలి ఏడాదిలో ఐఐటీ, బిట్స్ పిలానీ, ఎన్‌ఐటీతో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ గుర్తింపుపొందిన ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో చదవాలనుకున్న విద్యార్థులకు సహకారం అందించనున్నట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుమిత్ విర్మనీ తెలిపారు.