Teeth Fall In Dream : దంతాలు ఊడిపోతున్నట్టు కల వచ్చిందా.. దాని అర్ధం ఇదే !
Teeth Fall In Dream : మీ దంతాలు ఊడిపోతున్నట్టు ఎప్పుడైనా కల కన్నారా?అది కలే అని తెలిసినా.. కలవరపాటుకు గురయ్యారా ?
- By Pasha Published Date - 08:58 AM, Fri - 18 August 23

Teeth Fall In Dream : మీ దంతాలు ఊడిపోతున్నట్టు ఎప్పుడైనా కల కన్నారా?
అది కలే అని తెలిసినా.. కలవరపాటుకు గురయ్యారా ?
జనాభాలో 39% మంది తమ జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి కల కంటారని ఒక రీసెర్చ్ లో తేలింది.
8.2% మందికి తరచూ ఇలాంటి కలలు వస్తుంటాయట.
అయితే సైన్స్ కన్నా వీటి గురించి గ్రంధాలలోనే ఎక్కువగా ప్రస్తావించారు.
యూదు గ్రంధాల రచయితల నుంచి ప్రాచీన ఈజిప్షియన్, గ్రీకు తత్వవేత్తల వరకు చాలామంది కలలను దేవుడి నుంచి అందే కమ్యూనికేషన్ సాధనంగా విశ్వసించారు.
తీరని కోరికలు, మనసులో ఉన్న ఆందోళనలు కలలుగా వస్తాయని కొందరు నిర్వచనాలు కూడా ఇచ్చారు.
Also read : Skin Care Tips: అందమైన, మెరిసే చర్మం కావాలా..? అయితే మీరు చేయాల్సింది ఇదే..!
కలలో దంతాలు విరగడం చూస్తే రాబోయే కాలంలో మీరు కొత్త అవకాశాలను పొందుతారనే అర్థం ఉందని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఒక వ్యక్తి కలలో తన దంతాలను ఎవరో విరగ్గొడుతున్నట్టు కనిపిస్తే మీ జీవితంలో ఏదో తప్పు జరుగుతుందని అర్థం చేసుకోవాలని సూచిస్తోంది. ఎవరైనా మీ దంతాలను పట్టుకున్నట్లు లేదా పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తే.. భవిష్యత్తులో పెద్ద మార్పు జరగబోతోందనడానికి సంకేతమని స్వప్న శాస్త్రం పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ దంతాల గురించి వచ్చే కలలపై ఇజ్రాయెల్‌లోని నెగెవ్‌లో ఉన్న బెన్ గురియన్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు రోజెన్, సోఫర్-డుబెక్ ఇటీవల స్టడీ చేశారు. దంతాల కలలు, మానసిక ఆలోచనలను అర్థం చేసుకునేందుకు ఓ పరిశోధన నిర్వహించారు. కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసుకుని కలలు, సైకలాజికల్ స్ట్రెస్, నిద్ర, పంటి సమస్యల గురించి అధ్యయనం నిర్వహించారు. దంతాలకు సంబంధించిన చికాకులు, నిద్రలో పళ్లు కొరకటం పై ప్రధానంగా దృష్టి సారించారు. చాలా మంది నిద్రలో పళ్లు కొరకడం గురించి తెలియదన్నారు. కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. ఈ కలలతో నిద్రకు కానీ మానసిక ఆరోగ్యానికి కానీ ఎలాంటి సమస్యా లేదని పరిశోధకులు గుర్తించారు.
నిరాశ, ఆందోళన, నిస్సహాయత
దంతాలు విరగడం వంటి కలలు(Teeth Fall In Dream) వచ్చే వారిలో నిరాశ, ఆందోళన, నిస్సహాయత, నియంత్రణ కోల్పోవడం లాంటివి ఉన్నాయని గుర్తించారు. మీకు బాగా కావాల్సినవాళ్లు రుణం తీరకుండానే చనిపోతే ఆ ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు ఇలాంటి కలలు వస్తాయని ఈజిప్టియన్ ఫిలాసఫర్స్ చెప్పారు. లైంగిక ఆలోచనలున్నా, లైంగిక భయాలున్నా ఇలాంటి కలలు వస్తాయని ఇంకొందరు తెలిపారు.
గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.