Census 2036 : పెరిగిపోనున్న మహిళలు, సీనియర్ సిటిజెన్లు.. 2036 నాటికి దేశ జనాభాలో పెనుమార్పులు
ఇప్పుడు మనదేశ జనాభా దాదాపు 140 కోట్లకుపైనే ఉంది. 2036 సంవత్సరం నాటికి ఈ జనాభా ఎంతకు చేరుతుంది ?
- By Pasha Published Date - 10:01 AM, Tue - 13 August 24

Census 2036 : ఇప్పుడు మనదేశ జనాభా దాదాపు 140 కోట్లకుపైనే ఉంది. 2036 సంవత్సరం నాటికి ఈ జనాభా ఎంతకు చేరుతుంది ? అనే దానిపై కేంద్ర గణాంకాలశాఖ పరిధిలోని సామాజిక గణాంక విభాగం తాజాగా కీలక నివేదికను విడుదల చేసింది. ‘ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023’ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
‘ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023’ నివేదిక ప్రకారం.. 2036(Census 2036) నాటికి భారతదేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభాలో 48.5% మంది మహిళలు ఉన్నారు. 2036 నాటికి మన దేశ జనాభాలో దాదాపు 48.8 శాతం మంది మహిళలే ఉంటారని నివేదిక అంచనా వేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలోని ప్రతి 1000 మందికిగానూ 943 మంది మహిళలు ఉన్నారు. 2036 నాటికి మహిళల సంఖ్య 952కు పెరుగనుంది. లింగ సమానత్వం సాధించే దిశగా భారత్ పురోగమిస్తోంది అనేందుకు ఇదొక సంకేతమని పరిశీలకులు అంటున్నారు. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 37.7 కోట్ల పట్టణ జనాభా ఉంది. అది 2036 నాటికి 59.4 కోట్లకు చేరనుంది. దేశంలోని గ్రామీణ జనాభా కూడా 83.3 కోట్ల నుంచి 92.7 కోట్లకు పెరగనుంది.
Also Read :Telangana Cabinet : త్వరలోనే నాలుగు మంత్రి పదవుల భర్తీ.. పలువురికి నామినేటెడ్ పోస్టులు
- మన దేశంలో సంతాన సాఫల్య రేటు క్రమంగా తగ్గిపోతోంది. ఈ ఎఫెక్టుతో 2036 నాటికి 15 ఏళ్లలోపు వారి జన సంఖ్య తగ్గిపోనుంది. దేశ జనాభాలో ఈ ఏజ్ గ్రూప్ వారి సంఖ్య 20 శాతం లోపే ఉంటుంది. ప్రతీ ఐదుగురు భారతీయుల్లో ఒకరు మాత్రమే 15 ఏళ్లలోపు వారు ఉంటారు.
- 15 నుంచి 29 ఏళ్ల ఏజ్ గ్రూపు వారు 2036 నాటికి మన దేశంలో 22.7 శాతం మందే ఉంటారు.
- 15 నుంచి 59 ఏళ్లలోపు వారిని వర్కింగ్ ఏజ్ గ్రూప్‌గా పిలుస్తారు. 2011 లెక్కల ప్రకారం మన దేశంలో 15 నుంచి 59 ఏళ్లలోపు జనాభా 60.7 శాతం. 2036 నాటికి వీరి సంఖ్య 64.9శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు.
- 30 నుంచి 59 ఏళ్లలోపు వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం దేశ జనాభాలో ఈ ఏజ్ గ్రూపు వారు 37 శాతం మంది ఉండగా, అది కాస్తా 42 శాతానికి పెరగనుంది.
- 2036 నాటికి 35-39 ఏళ్ల వయసువారి సంఖ్య అత్యధికంగా 8.3 శాతానికి చేరనుంది.
- 60 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజెన్ల జనాభా కూడా దేశంలో గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం దేశంలో వీరు 10.1 శాతం మేర ఉండగా, 2036 నాటికి వీరి జనసంఖ్య 15 శాతానికి పెరిగిపోతుంది.
- 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 0.5 శాతం నుంచి 1.5 శాతానికి పెరగనుంది.