Resignation: భారత్ లో గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్…ఉద్యోగాలకు గుడ్ బై చెప్పనున్న86 శాతం మంది…!!
కోవిడ్...మహమ్మారి ఉద్యోగుల లైఫ్ స్టైల్...ఆలోచనాశైలిని సమూలంగా మార్చేసింది. కోవిడ సమయంలో గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్ వచ్చింది.
- By hashtagu Published Date - 10:29 AM, Thu - 9 June 22

కోవిడ్…మహమ్మారి ఉద్యోగుల లైఫ్ స్టైల్…ఆలోచనాశైలిని సమూలంగా మార్చేసింది. కోవిడ్ సమయంలో గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్ వచ్చింది. జీవన సమతుల్యత, ఆనందంగా గడపడం కోసం ఉద్యోగులు తక్కువ జీతాలను తీసుకుని..ప్రమోషన్లు వదులుకునేందుకు సిద్దంగా ఉన్నారు. రానున్న ఆరు నెలల్లో భారత్ లో ప్రస్తుత ఉద్యోగాలకు రాజీనామా చేసే యోచనలోదాదాపు 86శాతం మంది ఉద్యోగులు ఆసక్తిగా ఉన్నారని రిక్రూట్ మెంట్ ఏజెన్సీ మైఖేల్ పేజీ వెల్లడించింది. అన్ని రంగాల్లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తుందని…సీనియర్ ఉద్యోగులు, ఎక్కువ వయస్సున్న ఉద్యోగులు కూడా ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారని చెప్పింది. వేతనం, పని చేస్తున్న పరిశ్రమ మార్పు, కంపెనీపై అసంత్రుప్తి వంటివి కూడా రాజీనామాలకు కారణమని పేర్కొంది.