India Vs China : సముద్రంలో ఇండియా వర్సెస్ చైనా.. భారత్ టార్గెట్ 175
India Vs China : ప్రస్తుతం ఇండియా చుట్టూ ఉన్న సముద్ర జలాల్లోకి చైనా 150 యుద్ధ నౌకలను ప్రవేశపెట్టింది.
- By Pasha Published Date - 08:45 AM, Mon - 18 September 23

India Vs China : ప్రస్తుతం ఇండియా చుట్టూ ఉన్న సముద్ర జలాల్లోకి చైనా 150 యుద్ధ నౌకలను ప్రవేశపెట్టింది. వచ్చే ఐదేళ్లలో యుద్ధ నౌకలను మరింత పెంచాలని చైనా ప్లాన్ చేస్తోంది. ఈనేపథ్యంలో అలర్ట్ అయిన ఇండియా కూడా యుద్ధ నౌకల సంఖ్యను పెంచుకోవడంపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం భారత నేవీ దగ్గర 132 యుద్ధ నౌకలే ఉన్నాయి. ఈనేపథ్యంలో రూ.2 లక్షల కోట్ల అంచనాతో 68 యుద్ధ నౌకలకు ఆర్డర్స్ ఇచ్చింది. 2030 నాటికి యుద్ధ నౌకల సంఖ్యను 160కి పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. 2035 నాటికి యుద్ధ నౌకల సంఖ్యను 175 చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఒక యుద్ధ నౌకలను పెంచకుంటే.. ఏవైనా సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో చైనాను కట్టడి చేయడం కష్టమవుతుందని భారత్ భావిస్తోంది.
Also read : Parliament Special Session : సంచలన నిర్ణయాలు ఉంటాయా ? నేటి నుంచే పార్లమెంట్ స్పెషల్ సెషన్
వాస్తవానికి ఇండియా సరిహద్దుల్లోని సముద్ర జలాల్లో 150 యుద్ధ నౌకలను మోహరించిన చైనా వద్ద.. మరో 200 యుద్ధ నౌకలు కూడా ఉన్నాయి. వాటిని ఇతర దేశాల సరిహద్దుల్లో డ్రాగన్ మోహరించింది. ఒకవేళ అవసరమైతే వాటిని కూడా చైనా ఎక్కడైనా వాడుకోగలుగుతుంది. దీన్నిబట్టి చైనా ఏ రేంజ్ లో సైనికశక్తిని పెంచుకుందో అంచనా వేయొచ్చు. భారత్ ఆ రేంజ్ లో యుద్ధ నౌకలను పెంచుకోవాలంటే.. ఇంకో 15 ఏళ్లు పట్టినా ఆశ్చర్యం ఉండదని రక్షణరంగ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా ఆర్మీ వద్ద ప్రస్తుతం 143 యుద్ధ విమానాలు, 130 హెలికాఫ్టర్‌లు (India Vs China) ఉన్నాయి. 8 నెక్స్ట్ జనరేషన్ కార్వెట్స్, 9 సబ్‌మెరైన్లు, 5 సర్వే వెసెల్స్, రెండు మల్టీ పర్పస్ వెసెల్స్‌ను భారత్‌లో నిర్మించనున్నారు.