Technical Graduates : ప్రతినెలా లక్ష శాలరీ.. ఆర్మీలో జాబ్స్..
Technical Graduates : బీఈ, బీటెక్ చేశారా ? అయితే ఇదే మంచి అవకాశం..
- Author : Pasha
Date : 24-04-2024 - 8:28 IST
Published By : Hashtagu Telugu Desk
Technical Graduates : బీఈ, బీటెక్ చేశారా ? అయితే ఇదే మంచి అవకాశం.. నెలకు లక్ష రూపాయల దాకా శాలరీ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. చేయాల్సిందల్లా ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (టీజీసీ)కు అప్లై చేయడమే. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. అవివాహిత పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ https://joinindianarmy.nic.in ద్వారా అప్లై చేయాలి. ఇందుకోసం ఎలాంటి దరఖాస్తు రుసుమును కట్టాల్సిన అవసరం లేదు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 2024 మే 9 .
We’re now on WhatsApp. Click to Join
సివిల్ ఇంజినీరింగ్ వాళ్లకు 7 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ వాళ్లకు 7 పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వాళ్లకు 3 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పోస్టులు 4, మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టులు 7, ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో 2 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా కోర్సుల్లో ఫైనలియర్‌లో ఉన్న వాళ్లు కూడా అప్లై చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ పోస్టులకు ఎమ్మెస్సీ సీఎస్/ఐటీ చేసినవాళ్లు కూడా అర్హులే. అభ్యర్థుల వయస్సు 2025 జనవరి 1 నాటికి 20 ఏళ్ల నుంచి 27 ఏళ్ల లోపు(Technical Graduates) ఉండాలి. 1998 జనవరి 2 నుంచి 2005 జనవరి 1 మధ్య జన్మించిన వాళ్లే ఈ జాబ్స్‌కు అర్హులు.
Also Read :What is Bha : హమ్మయ్య.. చెప్పుల కష్టాలకు చెక్.. ‘భా’.. వచ్చేస్తోంది!
- బీటెక్‌లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- వీరికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) 5 రోజుల పాటు రెండు దశల్లో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఈ ఎంపిక ప్రక్రియ బెంగళూరు కార్యాలయంలో జరుగుతుంది.
- మొదటి రోజు స్టేజ్-1 స్క్రీనింగ్ (ఇంటెలిజెన్స్) పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో పాసయ్యే వారిని స్టేజ్-2కు ఎంపిక చేస్తారు.
- వీరికి 4 రోజుల పాటు పలు విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయ్యే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి.. అర్హత సాధించిన వారిని ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తారు.
- ఎంపికయ్యే అభ్యర్థులకు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న ఇండియన్ మిలటరీ అకాడమీలో 2024 జనవరి నుంచి ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు.
- ఈ టైంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ ఇస్తారు.
- కోర్సు పూర్తయ్యాక ప్రతినెలా రూ.56,100 శాలరీ, రూ.15,500 మిలటరీ సర్వీస్ పే చెల్లిస్తారు. వీటికి తోడు డీఏ, ఇతర ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. అన్నీ కలిపి మొదటి నెల నుంచే రూ.లక్ష దాకా జీతం వస్తుంది.