2 Deaths Due To H3N2: ఆ రెండు రాష్ట్రాలలో హెచ్3ఎన్2 వైరస్ మరణాలు.. అధికారులు అప్రమత్తం
హెచ్3ఎన్2 (H3N2) వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు శుక్రవారం తెలిపాయి. హర్యానాలో ఒకరు చనిపోగా, కర్ణాటకలో మరొకరు మరణించారు.
- By Gopichand Published Date - 12:31 PM, Fri - 10 March 23

హెచ్3ఎన్2 (H3N2) వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు శుక్రవారం తెలిపాయి. హర్యానాలో ఒకరు చనిపోగా, కర్ణాటకలో మరొకరు మరణించారు. ఇప్పటివరకు, దేశంలో దాదాపు 90 శాతం H3N2 వైరస్ కేసులు ఉన్నాయని, అదేవిధంగా ఎనిమిది మంది హెచ్1ఎన్1 వైరస్ బారినపడ్డారని వెల్లడించాయి.
ముఖ్యంగా, గత కొన్ని రోజులుగా దేశంలో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. చాలా ఇన్ఫెక్షన్లు ‘హాంకాంగ్ ఫ్లూ’ అని కూడా పిలువబడే H3N2 వైరస్ వల్ల సంభవిస్తాయి. అయితే, భారతదేశంలో ఇప్పటివరకు H3N2, H1N1 ఇన్ఫెక్షన్లు మాత్రమే కనుగొనబడ్డాయి. ఈ కొత్త వైరస్ సోకిన వాళ్లలో జ్వరం, వణుకు, దగ్గు, శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకునేటపుడు శబ్దాలు రావడం తదితర లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గత రెండు-మూడు నెలలుగా విస్తృతంగా వ్యాపిస్తున్న H3N2 వైరస్, ఇతర సబ్‌టైప్‌ల కంటే ఎక్కువ ఆసుపత్రిలో చేరడానికి కారణమవుతుందని, శ్వాసకోశ వైరస్‌ల వల్ల కలిగే వ్యాధులపై నిశితంగా గమనిస్తున్నట్లు ICMR శాస్త్రవేత్తలు తెలిపారు.
Also Read: Fridge Explosion: ఫ్రిడ్జ్ పేలి పోలీస్ అధికారి, మహిళ సజీవ దహనం.. కోయంబత్తూరులో ఘటన
హర్యానాలో ఇన్‌ఫ్లుఎంజా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇక్కడి ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య 40% పెరిగింది. ఇక్కడ ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉందని, వైద్యారోగ్య శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని కోరింది. అదే సమయంలో ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా దీని కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లక్షణాలు కనిపిస్తే పిల్లలను పాఠశాలకు పంపవద్దని ఆరోగ్య మంత్రి వేదాల రజని కుటుంబాలకు విజ్ఞప్తి చేశారు.
గత 6 నెలల్లో ఇన్‌ఫ్లుఎంజా కేసులు 200 శాతం పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. నవంబర్ నుండి జనవరి వరకు శీతాకాలం, వాయు కాలుష్యం, వైరల్ ఇన్ఫెక్షన్ల పెరుగుదల వీటిలో ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, అయితే దగ్గు, జలుబు, జ్వరం కేసులు వేగంగా పెరుగుతున్నాయని, ఇది ఇన్‌ఫ్లుఎంజా వైరస్ కారణంగా జరుగుతోందని నిపుణులు అంటున్నారు.

Related News

Karnataka election : ఎన్నికల ప్రచారానికి రాహుల్ సన్నద్ధం
కర్ణాటక ఎన్నికల(Karnataka election) ప్రచారానికి రాహుల్ సిద్ధమయ్యారు.