India Bloc : ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే..?
- By Sudheer Published Date - 07:47 PM, Tue - 19 December 23

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను ఇండియా కూటమి (India Bloc) ప్రధాని అభ్యర్థి (PM Candidate)గా టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ (West Bengal CM Mamata Banerjee) ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎండీఎంకే చీఫ్ వైకో మద్దతు తెలిపారు. మంగళవారం ఢిల్లీ అశోక హోటల్ లో ఇండియా కూటమి నాల్గో సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాల గురించి చర్చలు జరిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే క్రమంలో మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎండీఎంకే చీఫ్ వైకో మద్దతు తెలిపారు. అయితే, మల్లిఖార్జున ఖర్గే మాత్రం సున్నితంగా ఈ ప్రతిపాదనను నిరాకరించారు. ముందుగా సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేద్దామని.. ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దామని మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు.
Read Also : CM Revanth Delhi : ఉమ్మడి ఆస్తుల విభజనపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష