Flash Floods: దుర్గామాతా నిమజ్జనంలో అపశృతి…నదిలో పలువురు గల్లంతు…8మంది మృతి..!!
పశ్చిమబెంగాల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. జల్‌పైగురి జిల్లాలో దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనంలో అపశృతి జరిగింది.
- By hashtagu Published Date - 05:14 AM, Thu - 6 October 22

పశ్చిమబెంగాల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. జల్‌పైగురి జిల్లాలో దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనంలో అపశృతి జరిగింది. దసరా సందర్భంగా జల్‌పైగురి జిల్లాలోని మాల్ నదిలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం చేస్తుండగా…క్షణాల్లో వరద ఉదృతి పెరిగింది. దీంతో పదుల సంఖ్యలో జనం నీటిలో కొట్టుకుపోయారు. వీరిలో 8 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
బుధవారం సాయంత్రం దుర్గామాత నిమజ్జనోత్సవానికి హాజరయ్యేందుకు వందలాది మంది మల్ నది ఒడ్డుకు చేరుకున్నారు. ఈ సమయంలో ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో చాలా మంది వరదల్లో కొట్టుకుపోయారని జిల్లా మేజిస్ట్రేట్ మౌమితా గోద్రా తెలిపారు. ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న సీఎం మమతా బెనర్జీ హుటాహుటిన రెస్య్కూ ఫోర్స్ ను ఘటనాస్థలానికి పంపించి సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు.
కాగా ఇప్పటివరకు 8మంది శవాలను వెలికితీశారు. సుమారు 50మందిని పోలీసులు రక్షించారు. NDRF, SDRF, పోలీసులు, స్థానియ యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొంది. చీకటికావడంతో సహాయక కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
बंगाल के जलपाईगुड़ी जिला के माल बाजार में बड़ा हादसा। नदी में अचानक नदी का जलस्तर बढने से दुर्गा विसर्जन करने गए करीब 20 से 25 लोग लापता. अब तक सात लोगों की मौत हो चुकी है. pic.twitter.com/fwAcUE3S1l
— Umesh kumar (جوکر) (@umeshjoker) October 5, 2022