Political Trend : జైలుకు వెళ్తే సీఎం పదవి పక్కా
Political Trend : రాజకీయ నేత జైలు కు వెళ్లాడంటే..నెక్స్ట్ అతడు రాష్ట్రానికి సీఎం అవ్వాల్సిందే..ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఓ నేత జైలు కు వెళ్లాడంటే అతడి ఇమేజ్ భారీగా పెరగడమే కాదు..ప్రజల్లో అతడిపై మంచి , సానుభూతి పెరిగి చివరకు తమను పాలించే అధికారం అతడికి కట్టబెడుతున్నారు
- By Sudheer Published Date - 03:45 PM, Sat - 23 November 24

ఓ వ్యక్తి జైలు (Jail) కు వెళ్లాడంటే..సమాజంలో అతడ్ని తక్కువ చేయడం , చెడుగా చూడడం చేస్తారు. ఆ వ్యక్తి చిన్న నేరం చేశాడా..? పెద్ద నేరం చేశాడా..? ఎందుకు చేసాడు..? ఎందుకు చేయాల్సి వచ్చింది..? ఆ నేరం చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఎవ్వరు ఆలోచించారు. జస్ట్ అతడు ఓ నేరగాడని ముద్ర వేసి అతడి విషయంలో చెడుగా ప్రవర్తిస్తుంటారు. ఇదంతా సామాన్య ప్రజలది. కానీ రాజకీయ నేత (Political Leader) జైలు కు వెళ్లాడంటే..నెక్స్ట్ అతడు రాష్ట్రానికి సీఎం (CM Post) అవ్వాల్సిందే..ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఓ నేత జైలు కు వెళ్లాడంటే అతడి ఇమేజ్ భారీగా పెరగడమే కాదు..ప్రజల్లో అతడిపై మంచి , సానుభూతి పెరిగి చివరకు తమను పాలించే అధికారం అతడికి కట్టబెడుతున్నారు. ఈ మధ్య పలు నేరాలు చేసి కొంతమంది జైలుకు వెళ్తే..అభియోగాలు కారణంగా జైలుకు వెళ్లి సీఎం అయినవారు చాలామందే ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, ఝార్ఖండ్ సీఎం సోరెన్..ఇలా వీరంతా జైలు కు వెళ్లి సీఎం పదవులు అందుకున్న వారే. ఉదాహరణ కు ఏపీ ప్రతిపక్ష నేతగా జగన్..ఎన్నో నేరాలు చేసి జైలుకు వెళ్ళాడు..కొన్నేళ్ల పాటు జైలు జీవితం గడిపిన ఆయనకు రాష్ట్ర ప్రజలు తమను పాలించే అధికారం కట్టబెట్టారు. అలాగే జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని జైలుకి వెళ్లాడు. ప్రస్తుతం సీఎంగా దూసుకెళ్తున్నాడు. ఇదే తరహాలు తెలంగాణలో రేవంత్ రెడ్డి జైలుకి వెళ్లాడు. సీన్ కట్ చేస్తే తెలంగాణకి సీఎం అయ్యాడు. ఇదే ట్రెండ్‌ని కొనసాగిస్తూ జైలు నుంచి వచ్చి సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు సోరెన్. నెక్స్ట్ దిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ గెలిస్తే ఇదే ట్రెండ్ మరోసారి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తం మీద జైలు జీవితం అనేది రాజకీయ నేతల రాజకీయ భవిష్యత్ ను మార్చేస్తుంది. అందుకే ఈ మధ్య ప్రతి ఒక్క రాజకీయ నేత తమను జైళ్లు వేసే అధికారం ఉందా..? అని ప్రశ్నిస్తూ అధికార పార్టీలకు సవాళ్లు విసురుతున్నారు.
Read Also : Maharashtra : కాంగ్రెస్ గారడీని ప్రజలు నమ్మలేదు: హరీష్‌రావు