Bank Jobs : డిగ్రీ చేశారా.. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు జాబ్స్
బ్యాంకు జాబ్స్‌కు భలే క్రేజ్ ఉంది.
- By Pasha Published Date - 01:08 PM, Sat - 8 June 24
![Bank Jobs : డిగ్రీ చేశారా.. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు జాబ్స్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Bank-Jobs.jpg)
Bank Jobs : బ్యాంకు జాబ్స్‌కు భలే క్రేజ్ ఉంది. చాలామంది యువత బ్యాంకులో జాబ్ సంపాదించాలనే డ్రీమ్‌తో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) కోసం సీరియస్‌గా ప్రిపేర్ అవుతుంటారు. అలాంటి వారికి ఐబీపీఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా జూన్ 6న ఓ జాబ్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఆఫీసర్ (స్కేల్- I, II, III), ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)/ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తామని అనౌన్స్ చేసింది. వీటికి ఎంపికయ్యే వారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ గ్రామీణ బ్యాంకుల్లో జాబ్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్‌లలో ఈ జాబ్స్ ఉంటాయి. https://www.ibps.in/ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి.
We’re now on WhatsApp. Click to Join
ఈ జాబ్స్‌కు అప్లై చేసే ముందు మనం వయోపరిమితి గురించి తెలుసుకోవాలి. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి.ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 21 నుంచి 32 ఏళ్లలోపు ఉండాలి. ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి.
Also Read :TV Channels : టీవీ ఛానళ్ల రేట్లకు రెక్కలు.. సామాన్యుల జేబుకు మరో చిల్లు
పోస్టులను బట్టి అభ్యర్థులకు బ్యాచిలర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ సీఏ అర్హత ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం. కాగా, దరఖాస్తు చేయడానికి లాస్ట్ డేట్ జూన్ 27. అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 3, 4, 10, 17, 18 తేదీల్లో ఉంటుంది. మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 29, 06 తేదీల్లో ఉంటుంది. వీటిలో క్వాలిఫై అయ్యే వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులైన వారిని ఉద్యోగాలకు(Bank Jobs) ఎంపిక చేస్తారు.
Also Read : Re KYC : బ్యాంకు అకౌంటుకు రీ కేవైసీ చేసుకోవాలా ? చాలా ఈజీ
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![IBPS Clerks : 6వేల ఐబీపీఎస్ క్లర్క్ జాబ్స్.. దరఖాస్తు గడువు పెంపు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/6128-Jobs.jpg)
IBPS Clerks : 6వేల ఐబీపీఎస్ క్లర్క్ జాబ్స్.. దరఖాస్తు గడువు పెంపు
ఐబీపీఎస్ క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే గడువు పెరిగింది. ఇప్పుడు అభ్యర్థులు జులై 28 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.