HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Husband Tortures Wife Dowry Case Khargone Madhya Pradesh

Tragedy : దారుణం.. నొప్పితో అరుస్తోందని నోట్లో వేడి కత్తి పెట్టి హింస

Tragedy : మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్ జిల్లా ఒక అమానుష ఘటనతో కలకలం రేపింది. భార్య కట్నం తీసుకురాలేదనే కారణంతో ఓ భర్త అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు.

  • By Kavya Krishna Published Date - 10:49 AM, Tue - 26 August 25
  • daily-hunt
Tragedy
Tragedy

Tragedy : మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్ జిల్లా ఒక అమానుష ఘటనతో కలకలం రేపింది. భార్య కట్నం తీసుకురాలేదనే కారణంతో ఓ భర్త అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. తాళ్లతో కట్టేసి, వేడి కత్తితో శరీరంపై వాతలు పెట్టడమే కాకుండా, నొప్పితో బాధితురాలు కేకలు వేస్తుండగా ఆ కత్తిని నోట్లో పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ నరకయాతన నుంచి బాధితురాలు చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలను కాపాడుకుంది. బాధితురాలు ఖుష్బూ పిప్లియా (23) తెలిపిన ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లయిన రోజు నుంచి భర్త తనను ఇష్టపడకపోగా, తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఆదివారం రాత్రి మద్యం తాగి మత్తులో ఉన్న భర్త మొదట ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. అనంతరం వంటగదిలోకి ఈడ్చుకెళ్లి చేతులు, కాళ్లు కట్టి, తుపాకీ లాంటి వస్తువుతో బెదిరించాడు. తరువాత వేడి కత్తితో ఛాతీ, చేతులు, కాళ్లపై వాతలు పెట్టాడని ఆమె వాంగ్మూలంలో పేర్కొంది. “మా వాళ్లు నిన్ను బలవంతంగా ఇచ్చారు, నువ్వంటే నాకు ఇష్టం లేదు” అంటూ దాడి చేశాడని తెలిపింది.

Ganesh Chaturthi : గణనాథుడి రూపంలోని ఆంతర్యం అదే!

ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని ఖుష్బూ ఆరోపించింది. అయితే ఎవరూ ఆపలేదని తెలిపింది. సోమవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఖుష్బూ తన కట్లను విప్పుకుని బయటకు పారిపోయింది. ఇంట్లో పనిచేసే సిబ్బంది నుంచి మొబైల్ తీసుకుని తన కుటుంబానికి సమాచారం అందించింది. వెంటనే ఆమె తండ్రి లోకేశ్ వర్మ, తన చిన్న కుమారుడిని పంపించి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఖుష్బూ నుంచి వాంగ్మూలం నమోదు చేసి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Spirituality : పూజా గృహ నియమాలు ఏమిటి?..అగరబత్తి, పువ్వులకి వాస్తు నియమాలు ఏమిటి?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime news
  • Domestic Violence
  • dowry harassment
  • Khargone incident
  • Madhya Pradesh Crime

Related News

Domestic Violence

Domestic Violence : అక్రమ సంబంధం తెలిసిపోయిందని కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

Domestic Violence : వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్న ఘోర హత్యకేసు స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పానుగల్ రోడ్డులో నివసించే నాగమణి, గణేష్ నగర్‌కు చెందిన శ్రీకాంత్ మధ్య అనైతిక సంబంధం నెలకొంది

    Latest News

    • Raina- Dhawan: టీమిండియా మాజీ క్రికెట‌ర్లు రైనా, ధావన్‌లకు బిగ్ షాక్‌!

    • Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వ‌శ్చ‌న్ ఏంటంటే?

    • T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026.. భారత్‌లోని ఈ 5 నగరాల్లోనే మ్యాచ్‌లు!

    • TTD : తెలంగాణ భక్తులకు టీటీడీ శుభవార్త

    • Praja Sankalpa Yatra : మరోసారి జగన్ పాదయాత్ర..ఎప్పటి నుండి అంటే !!

    Trending News

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd