Union Budget 2024: ఉద్యోగస్తులకు ఉపశమనం, ట్యాక్స్ కట్టక్కర్లేదు
రూ.3 నుంచి 7 లక్షల వార్షిక ఆదాయంపై 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది కొత్త పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ప్రామాణిక పన్ను మినహాయింపులో ఎలాంటి మార్పు లేదు.
- By Praveen Aluthuru Published Date - 02:16 PM, Tue - 23 July 24

Union Budget 2024: ఈసారి బడ్జెట్‌లో ఉద్యోగస్తులకు శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. పన్ను విషయంలో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయా రంగాలకు తీపి కబురు అందించింది. బడ్జెట్ ప్రసంగంలో పన్ను చెల్లింపుదారులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ తెలిపారు. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ ట్యాక్స్ డిడక్షన్‌ను రూ.75,000కు తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. గతంలో స్టాండర్డ్ ట్యాక్స్ డిడక్షన్ రూ.50,000 గా ఉండేది. దీంతో రూ.3 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను ఉండదు. అదే సమయంలో రూ.3 నుంచి 7 లక్షల వార్షిక ఆదాయంపై 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది కొత్త పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ప్రామాణిక పన్ను మినహాయింపులో ఎలాంటి మార్పు లేదు.
కొత్త పన్ను విధానంలో మార్పులు చేశామని, పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పు లేదని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇప్పుడు కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను కట్టక్కర్లేదు. ఇది ఉద్యోగస్తులకు ఉపశమనం కలిగిస్తుంది. అదే సమయంలో రూ.3 నుంచి 7 లక్షల వార్షిక ఆదాయంపై 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.7 నుంచి 10 లక్షల వార్షిక ఆదాయంపై 10 శాతం, రూ. 10 నుంచి 12 లక్షల వార్షిక ఆదాయంపై 15 శాతం పన్ను విధిస్తారు. అదేవిధంగా వార్షిక ఆదాయం రూ.12 నుంచి 15 లక్షల వరకు 20 శాతం, రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం పన్ను విధించనున్నారు.
Also Read: Union Budget 2024 : మహిళల పేరిట ఆస్తులు కొంటే ఆ బెనిఫిట్.. బడ్జెట్‌లో కీలక ప్రకటన