Union Budget 2024 : మహిళల పేరిట ఆస్తులు కొంటే ఆ బెనిఫిట్.. బడ్జెట్‌లో కీలక ప్రకటన
ఎన్డీయే సర్కారు ఇవాళ కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటనలు చేసింది.
- By Pasha Published Date - 02:10 PM, Tue - 23 July 24

Union Budget 2024 : ఎన్డీయే సర్కారు ఇవాళ కేంద్ర బడ్జెట్‌లో(Union Budget 2024) కీలక ప్రకటనలు చేసింది. ప్రత్యేకించి మహిళ పేరిట కొనే ఆస్తులపై పన్నుల భారాన్ని తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.ఈ దిశగా అన్ని రాష్ట్రాలను ప్రోత్సహిస్తామన్నారు. ఈ విధానాన్ని దేశంలోని పట్టణ డెవలప్‌మెంట్ స్కీంలలో(Urban Housing) భాగంగా మారుస్తామని బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించింది. మహిళల పేరిట కొనే ఆస్తులకు స్టాంపు డ్యూటీ భారం నుంచి మినహాయింపు కల్పిస్తామని పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join
బడ్జెట్‌లోని మరిన్ని ప్రతిపాదనలు
- ఇంటి అద్దెల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇకపై ‘‘ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్’ విభాగంలో పరిగణించరు. వాటిని ‘ఇన్‌కమ్ ఫ్రం హౌజ్ ప్రాపర్టీ’ అనే ప్రత్యేక విభాగంలో చేరుస్తారు.
- స్థిరాస్తిని విక్రయించే వ్యక్తుల సంఖ్య.. దాన్ని కొనుగోలు చేసే వ్యక్తుల సంఖ్య ఆధారంగా మొత్తం లావాదేవీపై టీడీఎస్‌ను ఇకపై విధిస్తారు.
- బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ నిషేధ చట్టం – 1988లోనూ కీలక సవరణలు ప్రతిపాదించారు.
- బినామీదారుడిగా ఉన్న వ్యక్తి దర్యాప్తు సంస్థల ఎదుట నిజాన్ని ఒప్పుకుంటే జరిమానా, శిక్షల నుంచి మినహాయింపు కల్పించే నిబంధనను చట్టంలో చేరుస్తామని ప్రపోజ్ చేశారు.
- బినామీ ఆస్తులను దర్యాప్తు సంస్థలు అటాచ్ చేసే విషయంలో హేతుబద్ధమైన కాల పరిమితిని నిర్దేశించారు.
- రుణ మంజూరు వ్యవస్థలు, ఎంఎస్ఎంఈ సర్వీసుల వంటి మొత్తం 7 విభాగాల కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రా అప్లికేషన్లను డెవలప్ చేయనున్నారు.
- ట్యాక్సులకు సంబంధించిన లావాదేవీలలో ఆధార్ నంబర్ బదులుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని వినియోగించే పద్ధతిని ఇకపై కొనసాగించరు.
- వచ్చే ఐదేళ్లలో దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాల అర్బన్ హౌజింగ్‌కు ‘ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – అర్బన్’ స్కీం ద్వారా ఆర్థిక చేయూత అందించేందుకు రూ.2.2 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.
- ఈ నిధుల ద్వారా అర్బన్ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు తీసుకునే రుణాలపై వడ్డీరాయితీని అందించే స్కీంను కూడా అమలు చేస్తారు.