Hema Malini Trolled Vinesh Phogat: వినేష్ ఫోగట్‌ను ఎగతాళి చేసిన హేమ మాలిని
వినేష్ ఫోగట్‌ను ఎగతాళి చేసిన హేమ మాలిని.బరువును అదుపులో ఉంచుకోవడం ముఖ్యమని వ్యాఖ్యానించింది. బరువు పెరగడం ఆమెకు ఒక పాఠం లాంటిదని, ఆమె త్వరగా 100 గ్రాములు కోల్పోవాలని నేను కోరుకుంటున్నాను అంటూ నవ్వుతూ స్పందించిన తీరు పలువురిని ఆగ్రహానికి గురి చేసింది.
- By Praveen Aluthuru Published Date - 08:27 PM, Wed - 7 August 24

Hema Malini Trolled Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు ముందు భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడటంపై యావత్ భారత్ నిరాశకు గురైంది. ఆమెకు సాధారణ ప్రజల నుంచి దేశ ప్రధాని వరకు, సెలబ్రిటీలు సైతం మద్దతుగా నిలిచారు. తమ మద్దతును సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. అయితే ప్రముఖ నటి హేమ మాలిని వినేష్ ఫోగట్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె స్పందించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ సీనియర్ నటి వ్యాఖ్యలపై ప్రజలు అభ్యంతరం తెలుపుతున్నారు. సిగ్గుచేటుగా అభివర్ణించారు.
హేమ మాలిని పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడింది. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉన్నందుకు ఆమె అనర్హత వేటు వేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పింది. అలాగే బరువును అదుపులో ఉంచుకోవడం ముఖ్యమని వ్యాఖ్యానించింది. బరువు పెరగడం ఆమెకు ఒక పాఠం లాంటిదని, ఆమె త్వరగా 100 గ్రాములు కోల్పోవాలని నేను కోరుకుంటున్నాను అంటూ నవ్వుతూ స్పందించిన తీరు పలువురిని ఆగ్రహానికి గురి చేసింది.
To the extent that these leaders can exhibit their empty hearts. Instead of supporting MP Hema Malini giving a lecture on weight maintenance. 💔
At times, such a smile on face looks Evil. #Phogat_Vinesh pic.twitter.com/X52fy6Btqr— RAHUL (@RahulSeeker) August 7, 2024
హేమమాలిని చేసిన కామెంట్స్ పై ట్విట్టర్ వినియోగదారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నటి హేమ మాలిని వీడియోను షేర్ చేస్తూ.. “పారిస్ ఒలింపిక్స్ 2024 నుండి నిష్క్రమించినందుకు వినేష్ ఫోగట్‌ను బిజెపి ఎంపి హేమ మాలిని ఎగతాళి చేస్తున్నారు” అని ఒక వినియోగదారు రాశారు.హేమమాలిని చిరునవ్వును లక్ష్యంగా చేసుకుని ఒక వినియోగదారు ఇలా అన్నారు “ఈ నాయకులు తమ చెడు మనస్తత్వాలను బహిర్గతం చేస్తుంటారని, కొన్నిసార్లు వాళ్ళ ముఖంలో కనిపించే నవ్వు కూడా దెయ్యంగా కనిపిస్తుందని వ్యంగ్యంగా స్పందించాడు. మరొకరు స్పందిస్తూ.. ఈ బీజేపీ ఎంపీ హేమ మాలిని తన కంట్రోల్‌లో కూడా లేని వినేష్ ఫోగట్‌ని ఎంత సిగ్గు లేకుండా వెక్కిరిస్తున్నారో చూడండి అంటూ ఫైర్ అయ్యారు.
Also Read: Vinesh Phogat: వినేష్‌కు మరో బిగ్ షాక్.. అప్పీల్‌ను తిరస్కరించిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్!