Sushma Andhare Helicopter Crash : పెను ప్రమాదం నుండి బయటపడ్డ సుష్మా అంధారే
మహద్‌లో ఓ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన సుష్మా అంధారే వద్దకు వచ్చిన హెలికాప్టర్ ల్యాండింగ్ (Helicopter landing) చేస్తుండగా ప్రమాదానికి గురైంది
- By Sudheer Published Date - 11:33 AM, Fri - 3 May 24

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా మహద్‌లో ఓ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన శివసేన యూబీటీ నాయకురాలు సుష్మా అంధారే (Sushma Andhare) పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడింది. మహద్‌లో ఓ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన సుష్మా అంధారే వద్దకు వచ్చిన హెలికాప్టర్ ల్యాండింగ్ (Helicopter landing) చేస్తుండగా ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ పూర్తిగా దెబ్బతింది, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అంధరే షేర్ చేసిన వీడియో రికార్డింగ్ ప్రకారం.. ఛాపర్ ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలింది. కుప్పకూలుతుండగా అందులోని పైలట్స్ వెంటనే కిందకు దూకడం తో వారు ప్రాణాలతో బయటపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం నడుస్తుంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలంతా తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలను కవర్ చేసే నేపథ్యంలో నేతలు హెలికాప్టర్(Helicopter)లో ప్రయాణం చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో పలు చోట్ల హెలికాప్టర్లలో పలు సాంకేతిక సమస్యలు రావడం వంటివి జరుగుతున్నాయి. రీసెంట్ గా బెగుసరాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేంద్రమంత్రి అమిత్ షా.. సభ పూర్తి అయిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. గాల్లోకి కొద్దిగా ఎగిరిన హెలికాప్టర్.. బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో కొద్దిసేపు అక్కడే చక్కర్లు కొట్టింది. ఏంజరుగుతుందో అని అంత ఖంగారుపడ్డారు. అనంతరం చాకచక్యంగా వ్యవహరించిన పైలట్.. హెలికాప్టర్‌ను సురక్షితంగా గాల్లోకి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పలువురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అందుకే రాజకీయ నేతలు హెలికాప్టర్ ప్రయాణం అంటే కాస్త ఖంగారుపడుతుంటారు.
नेता सुषमा अंधारे का हेलीकॉप्टर क्रैश-हेलीकॉप्टर में सुषमा अंधारे नहीं थी ।सुषमा अंधारे बैठने से पहले हुआ क्रैश-पायलट बचने की बात सामने आ रही है।सुषमा अंधारे का हेलीकॉप्टर पुणे में हुआ क्रैश।#HelicopterCrash #ShivThakare #Maharashtra #sushmaandare pic.twitter.com/0pNXGvXSr5
— Nidhi solanki🇮🇳 (@iNidhisolanki) May 3, 2024
#Helicoptercrashes in Maharashtra. Private helicopter which was flying to pick up #ShivSena Deputy Leader Sushma Andhare. pic.twitter.com/C15JUv6wK1
— dinesh akula (@dineshakula) May 3, 2024
Read Also : Rahul Gandhi Nomination: రాహుల్ గాంధీ నామినేషన్ కోసం యూపీకి బయల్దేరిన సీఎం రేవంత్