Tragedy : ఇంత సైకోలేంట్రా.. ఆరేళ్ల బిడ్డ చెబుతోన్న హృదయం రేకెత్తించే కథ..!
Tragedy : గ్రేటర్ నోయిడాలో సిర్సా గ్రామంలో దారుణమైన సంఘటన జరిగింది. స్థానికంగా, ఒక వ్యక్తి తన భార్యను సజీవంగా దహనం చేశాడు. ఈ ఘటనను బాధితురాలి ఆరుగేళ్ల కుమారుడు స్వయంగా మీడియాకు తెలిపారు.
- By Kavya Krishna Published Date - 10:10 AM, Sun - 24 August 25

Tragedy : గ్రేటర్ నోయిడాలో సిర్సా గ్రామంలో దారుణమైన సంఘటన జరిగింది. స్థానికంగా, ఒక వ్యక్తి తన భార్యను సజీవంగా దహనం చేశాడు. ఈ ఘటనను బాధితురాలి ఆరుగేళ్ల కుమారుడు స్వయంగా మీడియాకు తెలిపారు. ఆ బాలుడు తండ్రే తల్లిని హత్య చేసినట్టు కన్నీటి పర్యంతం కై తెలిపాడు. బాలుడు వివరించిన వివరాల ప్రకారం, తల్లి పైకి ఏదో ద్రవం పోసి, తరువాత ఆమెను కొట్టి, చివరికి లైటర్‌తో మంటల్లో మోసి పడ్డాడు. ఆ బాలుడు మీడియాతో మాట్లాడుతూ, “మేరీ మమ్మీ కే ఉపర్ కుఛ్ దాలా, ఫిర చాంటా మారా ఫిర లైటర్ సే ఆగ్ లగా దీ” అని అమాయకంగా తెలిపాడు. మీడియా ప్రతినిధులు “మీ నాన్నే చంపాడా?” అని అడిగినప్పుడు బాలుడు తల ఊపి సమ్మతించాడు.
India Without Sponsor: స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్‌లో ఆడనున్న టీమిండియా?!
ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో మహిళపై దాడి చేసి, ఆమెను వెంట్రుకలు పట్టుకొని బయటికి లాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో వీడియోలో మంటల్లో చిక్కుకున్న బాధితురాలు మెట్లపై నుంచి అరుస్తూ ఉన్న సంఘటన చూడవచ్చు. మృతురాలి అక్క మాట్లాడుతూ, “నా చెల్లిని రూ.36 లక్షల కోసం భర్త, అత్తింటివారు హత్య చేశారు. గత కొన్ని రోజులుగా మమ్మల్ని వేధిస్తున్నారు. గురువారం రాత్రి మా చెల్లిని క్రూరంగా కొట్టి, చివరికి సజీవదహనం చేశారు. మా చెల్లి పిల్లలు కూడా ఇల్లు లోపలే ఉన్నారు. నేను ఏం చేయలేకపోయాను, నన్ను కూడా వేధించుకున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
Gold Price: భారీ షాక్.. లక్ష దాటిన బంగారం ధర!ఉత