Govt Survey Report : విద్య ఖర్చు తగ్గె.. పాన్, పొగాకు, డ్రగ్స్ ఖర్చు పెరిగె
Govt Survey Report : ‘గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23’ నివేదికలో దేశ ప్రజలు డబ్బులను ఖర్చు చేసే తీరుపై ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
- By Pasha Published Date - 07:50 PM, Sun - 3 March 24

Govt Survey Report : ‘గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23’ నివేదికలో దేశ ప్రజలు డబ్బులను ఖర్చు చేసే తీరుపై ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. దీని ప్రకారం.. గత పదేళ్లలో మన దేశంలో పాన్, పొగాకు, ఇతర మత్తు పదార్థాల వినియోగం పెరిగింది. ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువగా ఇలాంటి వాటిపైనే ఖర్చు చేస్తున్నారని వెల్లడైంది. మొత్తం ఇంటి ఖర్చులో పాన్, పొగాకు, మత్తు పదార్థాలపై చేసే వ్యయమే ఎక్కువగా ఉందని పట్టణ, గ్రామీణ ప్రాంతాలపై జరిపిన అధ్యయనంలో తేలింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ), స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 2022 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య ఈ సర్వేను(Govt Survey Report) నిర్వహించింది. గృహ వినియోగ వ్యయంపై ఈ సర్వే ప్రతి కుటుంబం నుంచి నెలవారీ తలసరి వినియోగ వ్యయం (ఎంపీసీఈ) అంచనాలను సేకరించింది.
We’re now on WhatsApp. Click to Join
- 2011-12 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు పాన్, పొగాకు, మత్తు పదార్థాలపై 3.21 శాతం ఖర్చు చేయగా.. 2022-23లో 3.79 శాతం ఖర్చు చేశారు. ఇక పట్టణ ప్రాంతాల్లో ఈ ఖర్చు 1.61 శాతం నుంచి 2.43 శాతానికి పెరిగింది.
- 2011-12 సంవత్సరంలో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో విద్య కోసం ప్రజలు చేసిన ఖర్చు 6.90 శాతం ఉండగా.. 2022-23 నాటికి అది కాస్తా 5.78 శాతానికి తగ్గిపోయింది. ఇక ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు విద్య కోసం చేసిన ఖర్చు 3.49 శాతం నుంచి 3.30 శాతానికి డౌన్ అయింది.
- డ్రింక్స్, ప్రాసెస్ చేసిన ఆహారంపై పట్టణ ప్రాంతాల ప్రజలు చేసే ఖర్చు 8.98 శాతం నుంచి 10.64 శాతానికి పెరిగింది. ఈ కేటగిరిలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు చేసే ఖర్చు 7.90 శాతం నుంచి 9.62 శాతానికి పెరిగింది.
- పట్టణ ప్రాంతాల ప్రజల రవాణా ఖర్చు 6.52 శాతం నుంచి 8.59 శాతం పెరగ్గా, గ్రామీణ ప్రాంతాల ప్రజల ఖర్చు 4.20 శాతం నుంచి 7.55 శాతానికి పెరిగింది.
Also Read : Limca Book Records: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమం
- ‘గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23’ నివేదిక ప్రకారం.. దేశ ప్రజల నెలవారీ తలసరి వినియోగ వ్యయం 2011-12 నుంచి 2022-23 మధ్య రెండింతలు పెరిగింది.
- నెలవారీ తలసరి వినియోగ వ్యయం పట్టణాల్లో రూ. 2,630 నుంచి రూ. 6,459కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1,430 నుంచి రూ. 3,773కి ఎగబాకింది.