Goods Trains Collide: మరో ఘోర రైలు ప్రమాదం.. పశ్చిమ బెంగాల్‌లో రెండు గూడ్స్ రైళ్లు ఢీ
పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలోని ఓండాలో ఆదివారం తెల్లవారుజామున రెండు గూడ్స్ రైళ్లు ఢీకొనడం (Goods Trains Collide)తో రైలు ప్రమాదం జరిగింది.
- By Gopichand Published Date - 08:25 AM, Sun - 25 June 23

Goods Trains Collide: పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలోని ఓండాలో ఆదివారం తెల్లవారుజామున రెండు గూడ్స్ రైళ్లు ఢీకొనడం (Goods Trains Collide)తో రైలు ప్రమాదం జరిగింది. దీని తర్వాత 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్లాట్‌ఫారమ్, సిగ్నల్ రూం ధ్వంసం కాగా డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఇందులో రెండు సరుకు రవాణా రైళ్లకు చెందిన ఒక ఇంజన్ సహా 12 బోగీలు పట్టాలు తప్పాయి.
తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో అద్రా-ఖరగ్‌పూర్ బ్రాంచ్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానిక సమాచారం ప్రకారం.. ఓడా రైల్వే స్టేషన్ సమీపంలోని లూప్ లైన్‌పై నిలబడి ఉన్న గూడ్స్ రైలు వెనుక బంకురా నుండి వస్తున్న మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఒక ఇంజన్‌తో పాటు రెండు గూడ్స్ రైలులోని 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. స్థానికులు డ్రైవర్లను కాపాడారు. రెండు సరుకు రవాణా రైళ్లు ఒకే లైన్‌పై ఎలా వచ్చాయని ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతానికి రైల్వేశాఖ నుంచి ఎలాంటి స్పందన లేదు.
Also Read: Hong Kong: తృటిలో తప్పిన ప్రమాదం.. హాంకాంగ్‌లో 293 మంది ప్రయాణికులు ఉన్న విమానానికి తప్పిన ముప్పు
ఓండా స్టేషన్ మీదుగా గూడ్స్ రైలు వెళ్తుండగా వెనుక నుంచి మరో గూడ్స్ రైలు ఢీకొట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనతో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఘటన తర్వాత ట్రాక్‌పై కోచ్‌లు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రెండు గూడ్స్ రైళ్లు ఖాళీగా ఉన్నాయి. ప్రమాదానికి గల కారణం ఏమిటి, రెండు రైళ్లు ఎలా ఢీకొన్నాయి అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రమాదం కారణంగా ఆద్రా డివిజన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు వీలైనంత త్వరగా అప్ లైన్ తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా పురూలియా ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని రైళ్లు ఈ డివిజన్ గుండా వెళ్ళవచ్చు.