Ayushman Health Insurance : సీనియర్ సిటిజన్లకు కేంద్రం తీపి కబురు
Centre extends Ayushman health insurance coverage to all above 70 : 70 ఏళ్లు పైబడిన వయసు కలిగిన సీనియర్ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- Author : Sudheer
Date : 11-09-2024 - 10:22 IST
Published By : Hashtagu Telugu Desk
Centre extends Ayushman health insurance coverage to all above 70 : దేశంలో 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు (Senior Citizens) కేంద్రం గుడ్ న్యూస్ (Central Govt) తెలిపింది. 70 ఏళ్లు పైబడిన వయసు కలిగిన సీనియర్ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని (Ayushman Health Insurance) వర్తింపజేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
* ఢిల్లీ ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం – 4కి ఆమోదం
* దేశవ్యాప్తంగా 31,350 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ. 12,461 కోట్ల కేటాయించిన బడ్జెట్ కు కేంద్రం ఆమోదం
* ఇప్పటివరకు రోడ్డు సదుపాయం లేని గ్రామాలు, మారుమూల పల్లెటూర్లకు రోడ్ల నిర్మాణం
* దేశవ్యాప్తంగా జల విద్యుత్తు ప్రాజెక్టులకు రూ 12,461 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం.
* రూ.10,900 కోట్లతో పీఎం ఈ డ్రైవ్ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ప్రధానంగా 70 ఏళ్లు పైబడిన వయసు కలిగిన సీనియర్ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింప జేయడం ఫై అంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం గొప్ప మానవతా దృక్పథంతో కూడుకుందని అంటున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది కలగనుంది. వారి సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కనుంది.
Read Also : Telangana Cabinet Expansion : క్యాబినెట్ విస్తరణ.. ఎవర్ని పదవి వరిస్తుందో..?